Afghanistan Cricket: అఫ్గాన్‌ టీ20 కెప్టెన్‌గా మహ్మద్‌ నబీ

అఫ్గానిస్థాన్‌ టీ20 కెప్టెన్‌గా మహ్మద్‌ నబీ ఎంపికయ్యాడు. దీంతో మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు నబీ అఫ్గాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘ఈ క్లిష్టమైన దశలో టీ20 ఫార్మాట్‌లో జాతీయ క్రికెట్‌ జట్టుకు నాయకత్వం వహించాలని అఫ్గాన్‌స్థాన్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తా.

Published : 10 Sep 2021 19:24 IST

(Photo:Mohammad Nabi Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: అఫ్గానిస్థాన్‌ టీ20 కెప్టెన్‌గా మహ్మద్‌ నబీ ఎంపికయ్యాడు. దీంతో మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు నబీ అఫ్గాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘ఈ క్లిష్టమైన దశలో టీ20 ఫార్మాట్‌లో జాతీయ క్రికెట్‌ జట్టుకు నాయకత్వం వహించాలని అఫ్గాన్‌స్థాన్‌ క్రికెట్‌ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తా. భగవంతుని దయతో రానున్న టీ20 ప్రపంచకప్‌లో దేశం గర్వపడే విధంగా రాణిస్తాం’ అని నబీ ట్వీట్ చేశాడు.

అయితే, కెప్టెన్‌గా ఉన్న తనని సంప్రదించకుండానే టీ20 ప్రపంచకప్‌నకు జట్టును ప్రకటించడంపై అసహనం వ్యక్తం  చేస్తూ రషీద్‌ఖాన్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని రషీద్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘అఫ్గాన్‌ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా, బాధ్యతాయుతమైన సభ్యుడిగా ఉన్న నాకు.. ప్రపంచకప్‌ జట్టు ఎంపికచేసే ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిన కనీస బాధ్యత ఉంటుంది. అలాంటిది అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు కానీ, సెలక్షన్‌ కమిటి కానీ నన్ను సంప్రదించకుండానే జట్టును ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నా. అయితే, అఫ్గాన్‌ క్రికెట్‌ జట్టుకు ఆడటం ఎప్పటికీ నాకు గర్వకారణమే’ అని రషీద్‌ ఖాన్‌ ట్వీట్‌ చేశాడు.

అఫ్గాన్‌ ప్రకటించిన జట్టు: రషీద్‌ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌, రహ్మానుల్లా గుర్బాజ్‌, కరీమ్‌ జనత్‌, హజ్రతుల్లా జాజాయ్‌, గుల్బాడిన్‌ నైబ్‌, ఉస్మాన్‌ ఘని, నవీన్‌ ఉల్‌ హక్‌, అస్ఘర్‌ అఫ్గాన్‌, హమీద్‌ హసన్‌, మహ్మద్‌ నబి, షరాఫుద్దీన్‌ అష్రాఫ్‌, నజీబుల్లా జద్రాన్‌, దావ్లత్‌ జద్రాన్‌, హష్మతుల్లా షాహిది, షాపూర్‌ జద్రాన్‌, మహ్మద్‌ షహ్జాద్‌, కాయిస్‌ అహ్మద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని