Benstokes: స్టోక్స్‌ది నిస్వార్థపూరితమైన నిర్ణయం: అజహరుద్దీన్ ప్రశంసలు

ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ సారథులు మహ్మద్‌ అజహరుద్దీన్‌, విరాట్‌ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తారు...

Published : 19 Jul 2022 01:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ సారథులు మహ్మద్‌ అజహరుద్దీన్‌, విరాట్‌ కోహ్లీ ప్రశంసలతో ముంచెత్తారు. అజహరుద్దీన్‌ ఓ ట్వీట్‌ చేస్తూ.. ఒక ఆటగాడి శారీరక ఇబ్బందుల గురించి అతడే బాగా అర్ధం చేసుకుంటాడని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ జట్టుకు అత్యుత్తమ సేవలు అందించిన బెన్‌స్టోక్స్‌ గొప్ప ఆటగాడే కాకుండా నిస్వార్థపూరితంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడని మెచ్చుకున్నాడు.

మరోవైపు విరాట్‌ కోహ్లీ సైతం స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోక్స్‌ చేసిన రిటైర్మెంట్‌ పోస్టుకే కామెంట్‌ చేశాడు. అతడు ఆడిన ఆటగాళ్లలో స్టోక్స్‌ అత్యంత పోటీ ఇచ్చే గొప్ప క్రికెటర్‌ అని కితాబిచ్చాడు. ఈ సందర్భంగా అతడిని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగా, బెన్‌స్టోక్స్‌ సామాజిక మాధ్యమాల వేదికగా తన నిర్ణయం ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో మంగళవారం ఆడేదే తన చివరి వన్డే అని వెల్లడించాడు. మూడు ఫార్మాట్లకు ఆడటం శ్రమతో కూడుకున్నదని, అది అతడికి శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా మరో నాణ్యమైన ఆటగాడి స్థానాన్ని లాగేసుకుంటున్నట్లు ఉందని అభిప్రాయపడ్డాడు. దీంతో ఇకపై టీ20లు, టెస్టులపై మరింత శ్రద్ధపెట్టి ఆడతానన్నాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని