Team India: గ్రేటెస్ట్‌ ఆల్‌రౌండర్‌ అనగానే.. అభిమానులు అతడి పేరే చెప్పారు!

టీమ్‌ఇండియా మాజీ సారథి మహ్మద్‌ అజాహరుద్దీన్‌ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. 1992 ప్రపంచకప్‌ నాటి సంగతుల్ని తాజాగా గుర్తుచేసుకున్నాడు...

Published : 24 Feb 2022 10:05 IST

(Photo: Mohammed Azharuddin Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహ్మద్‌ అజాహరుద్దీన్‌ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. 1992 ప్రపంచకప్‌ నాటి సంగతుల్ని తాజాగా గుర్తుచేసుకున్నాడు. ఆ టోర్నీకి సంబంధించిన రెండు ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు. అయితే, అందులో ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ ఆల్‌రౌండర్‌ ఒకరు మిస్సయ్యారని, అది ఎవరో కనిపెట్టాలని అభిమానులను కోరాడు. దీనికి సంబంధించి పలువురు అభిమానులు కపిల్‌దేవ్‌ పేరు చెప్పారు. చివరికి అజాహరుద్దీన్‌ సైతం 1983 ప్రపంచకప్‌ హీరో పేరునే వెల్లడించాడు. 1992 వన్డే ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాలో జరగ్గా అక్కడి సిడ్నీ హర్బర్‌ దగ్గర ఈ ఫొటోలు తీశారు. అప్పుడు కపిల్‌దేవ్‌ ఏదో ముఖ్యమైన పని మీద భారత్‌కు తిరిగి వచ్చాడని, దాంతో ఆ ఫొటో సెషన్‌లో పాల్గొనలేకపోయాడని అజాహరుద్దీన్‌ పేర్కొన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని