Shami: అతడు అద్భుతమైన బౌలర్‌.. మేం కూడా మిస్‌ అవుతున్నాం: షమీ

న్యూజిలాండ్‌పై (IND vs NZ) రెండో వన్డేలో అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా షమీ (Shami) ఎంపికైన సంగతి తెలిసిందే. సీనియర్‌ అయిన షమీ భారత బౌలింగ్‌ దళాన్ని నడిపిస్తున్నాడు. 

Published : 23 Jan 2023 01:32 IST

ఇంటర్నెట్ డెస్క్: గత టీ20 ప్రపంచకప్‌ నుంచి కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమ్‌ఇండియా మ్యాచ్‌లను ఆడేస్తోంది. స్వదేశంలో వరుసగా మూడో సిరీస్‌ను సొంతం చేసుకొంది. శ్రీలంకైనా కాస్త పోరాటం ఇచ్చింది కానీ, న్యూజిలాండ్‌ మాత్రం వన్డే సిరీస్‌లో తేలిపోయిందనే చెప్పాలి. మొదటి వన్డే చివరి వరకు విజయం కోసం ప్రయత్నించిన కివీస్‌.. రెండో వన్డేలో మాత్రం చేతులెత్తేసింది. సిరాజ్, షమీతో కూడిన పేస్‌ దళం దెబ్బకు కుప్పకూలింది. ఈ క్రమంలో బుమ్రా ఉంటే భారత ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగం ఇంకా బలంగా ఉంటుందనే వ్యాఖ్యలు వినిపించాయి. తాజాగా కివీస్‌పై వన్డే అనంతరం షమీ కూడా ఇదే విషయంపై స్పందించాడు. 

‘‘నాణ్యమైన ఆటగాళ్లు గైర్హాజరు కావడం ఎప్పుడూ బాధాకరమే. ఒక ఆటగాడు గాయపడినంత మాత్రాన.. ఆట అనేది ఎప్పుడూ ఆగదు. బుమ్రా వంటి గొప్ప బౌలర్ మిస్‌ అయ్యాం. తప్పకుండా అతడు త్వరలోనే తిరిగి వస్తాడనే నమ్మకం ఉంది. దాని కోసం ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు. భారత జట్టుతో కలిసేందుకు వేచి చూస్తున్నాడు’’ అని షమీ వెల్లడించాడు. బౌలింగ్‌కు అనుకూలించిన రాయ్‌పుర్‌లోని మైదానంలో భారత బౌలర్లు చెలరేగారు. కివీస్‌ కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. షమీ కేవలం 18 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు