Covid 19: టీకా తొలి డోసు తీసుకున్న మహ్మద్‌ షమీ

సుదీర్ఘ ఇంగ్లాండ్‌  పర్యటన కోసం టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. ఆటగాళ్లు ఇప్పటికే  ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో

Published : 27 May 2021 23:43 IST

(photo: Mohammed Shami Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీర్ఘ ఇంగ్లాండ్‌  పర్యటన కోసం టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. ఆటగాళ్లు ఇప్పటికే  ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. క్రికెటర్లందరికీ మూడు సార్లు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించిన అనంతరం జూన్‌ 2న ఛార్టెడ్‌ విమానంలో ఇంగ్లాండ్‌ తీసుకెళ్తారు. అయితే, ఈ పర్యటన దృష్టిలో ఉంచుకుని చాలామంది ఆటగాళ్లు ఇప్పటికే కొవిడ్‌ 19 మొదటి డోసు టీకాను తీసుకున్నారు. 

ఈ పర్యటనకు ఎంపికై జట్టు సభ్యులతో కలిసి క్వారంటైన్‌లో ఉన్న టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ మహ్మద్‌ షమీ  కూడా గురువారం కొవిడ్-19 టీకా తొలి డోసును తీసుకున్నాడు. ఈ విషయాన్ని షమీ తన ట్విటర్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘నా మొదటి డోసు టీకాను తీసుకున్నాను. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకుని సురక్షితంగా ఉండాలని కోరుతున్నా’ అనే వ్యాఖ్యను జత చేస్తూ వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశాడు షమీ.

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, ఛతేశ్వర్‌ పూజారా,ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్ శర్మ, జస్ప్రీత్‌  బుమ్రా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా తొలి డోసు టీకాను తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా,  సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్ జరగనుంది. ఈ పోరులో భారత్, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. అనంతరం ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా ఐదు టెస్టులు ఆడనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని