Mohammed Shami: మేం దేశం కోసమే పోరాడతాం.. అలాంటి వారిని పట్టించుకోం..: షమి

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓటమిపాలైన అనంతరం స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమి ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న...

Published : 01 Mar 2022 10:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గతేడాది టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ చేతిలో టీమ్‌ఇండియా ఓటమిపాలైన అనంతరం స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమి ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, తొలిసారి దానిపై స్పందించిన అతడు.. తనని విమర్శించిన వారు అసలు అభిమానులే కాదని, వాళ్లు నిజమైన భారతీయులు కూడా కాదని చెప్పాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన షమి తనపై వచ్చిన విమర్శలను ఏమాత్రం పట్టించుకోనని చెప్పాడు. ఒక ఆటగాడిగా తానేంటో తనకు తెలుసని చెప్పాడు.

‘సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు లేదా అతి తక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వాళ్లు.. ఇతరులపై విమర్శలు చేస్తే మాకు పోయేదేమీ లేదు. అలాంటి వారిని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేమేంటో మాకు తెలుసు. మాకు దేశం అంటే ఎంత గొప్పో తెలియజేయాల్సిన అవసరం లేదు. మేం దేశాన్ని గౌరవిస్తాం. దేశం కోసమే పోరాడతాం. అలాంటప్పుడు ఆ విమర్శలకు స్పందించి లేదా వారికి సమాధానం ఇచ్చి మా అంకితభావాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని షమి వివరించాడు. కాగా, షమి ప్రస్తుతం మణికట్టు గాయంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల జట్టుకు దూరమయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు