
స్కాట్లాండ్ అందాలు చూపిస్తున్న షమి
(Photo: Mohammed Shami Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమి స్కాట్లాండ్లో విహరిస్తున్నాడు. అక్కడి వీధుల్లో సంచరిస్తున్న వీడియోలను తన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. అక్కడ అందమైన భవనాలతో పాటు ఎంతో పరిశుభ్రంగా ఉన్న వీధులను అభిమానులకు చూపిస్తూ సంబరపడ్డాడు.
న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత భారత ఆటగాళ్లకు నెల రోజులకు పైగా ఖాళీ సమయం దొరకడంతో జట్టు యాజమాన్యం విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆ దేశంలో ఎక్కడైనా విహరించడానికి సుమారు 20 రోజులు అనుమతులిచ్చింది. ఈ క్రమంలోనే ఆటగాళ్లంతా తమ కుటుంబసభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లారు. అలా షమి కూడా స్కాట్లాండ్లో సంచరిస్తున్నాడు. ఆ వీడియోలనే ఇప్పుడు అభిమానులతో పంచుకున్నాడు.
మరోవైపు కెప్టెన్ కోహ్లీ, రోహిత్, అజింక్య రహానె దంపతులు లండన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సేద తీరుతుండగా అశ్విన్ ఇదివరకే తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్‌లోని పలు సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లొచ్చాడు. ఇక యువ క్రికెటర్లు కొందరు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, వింబుల్డన్ మ్యాచ్‌లను తిలకించారు. అయితే, వీరికిచ్చిన గడువు ఈనెల 14తో ముగియనుంది. దాంతో ఆటగాళ్లంతా ఆ రోజు లండన్‌లో కలుసుకోవాల్సి ఉంది. అక్కడి నుంచి వారు బయో బుడగలోకి ప్రవేశిస్తారు. ఆపై కౌంటీ XI జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు, తర్వాత ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Heavy Rains: ఇంటర్నెట్ను ‘తడిపేస్తున్న’ సరదా మీమ్స్ చూశారా?
-
General News
Andhra News: విద్యాశాఖ కీలక నిర్ణయం.. ఉన్నత పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు
-
India News
Mamata Banerjee: ‘కాళీ’ వివాదం.. మమత కీలక వ్యాఖ్యలు..!
-
Sports News
Rishabh Pant: పంత్ ఓపెనర్‌గా వస్తే..విధ్వంసమే : గావస్కర్
-
India News
bagless days: అక్కడి స్కూళ్లలో విద్యార్థులకు ఇక ప్రతి ‘శనివారం ప్రత్యేకమే’!
-
World News
UK: బోరిస్ రాజీనామా వేళ.. బ్రిటన్ నూతన ప్రధాని ఎన్నిక ఎలా జరుగుతుంది..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Rahul Dravid : బజ్‌బాల్ అంటే ఏమిటీ?
- అలుపు లేదు... గెలుపే!