Harbajhan singh: షమీ కీలకం.. అవకాశం కోసం వారు ఎదురు చూడాలి: హర్భజన్‌

టీ20 ప్రపంచకప్‌లో భారత తుది జట్టులో ఎవరుంటారనే అంశంపై మాజీ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ అంచనా వేశాడు. బుమ్రా లేని లోటును షమీ తప్పకుండా తీరుస్తాడని పేర్కొన్నాడు.

Published : 21 Oct 2022 02:14 IST

దిల్లీ: ప్రపంచకప్‌ నేపథ్యంలో అక్టోబర్‌ 23న జరగనున్న భారత్‌ -పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోరులో టీమ్ఇండియా బలాలు, బలహీనతలపై ఇప్పటికే పలువురు మాజీ ఆటగాళ్లు తమ విశ్లేషణలను వెల్లడించారు. తాజాగా భారత జట్టు సన్నద్ధతపై  మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా స్థానంలో వచ్చిన మహమ్మద్‌ షమీ అనుభవం జట్టును మరింత బలోపేతం చేస్తుందని వెల్లడించాడు. 

‘‘ నా అంచనా ప్రకారం.. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌ తుది జట్టులో కొనసాగుతారు. చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ కీలక ఆటగాళ్లుగా ఉంటారని అనుకుంటున్నాను. బుమ్రా లేకపోవడం వల్ల జట్టుకి షమీ అవసరం చాలా ఉంది. అతడు బాగా ఆడుతుండటం మంచి సంకేతం. తన బౌలింగ్‌ విధానం, గత అనుభవం దృష్ట్యా ఈ టోర్నీలో కీలకపాత్ర పోషించవచ్చు. హర్షల్‌ పటేల్‌, దీపక్‌ హుడా సైతం అవకాశం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. అక్షర్‌ పటేల్‌ వెనుదిరిగితే తప్ప అశ్విన్‌కు అవకాశం రాకపోవచ్చు. అయినా సుదీర్ఘ ఫార్మాట్‌కు అతడు సరైనవాడు. ఈ టోర్నీలో  ఎక్కువ అంచనాలు తగదు’’ అని హర్భజన్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని