Siraj - Rohit: రోహిత్‌ చాలా కష్టపడ్డాడు.. కానీ ‘ఐదు’ రాలేదు: సిరాజ్‌

శ్రీలంకతో మూడో వన్డే (Ind vs SL)లో ఐదు వికెట్ల ముచ్చటను తీర్చుకుందామని సిరాజ్‌ (Mohammed Siraj) చాలా ట్రై చేశాడు. దీనికి రోహిత్‌ శర్మ (Rohit Sharma) కూడా  సాయం చేశాడు. కానీ ఆఖరికి వీలవలేదు. 

Published : 16 Jan 2023 01:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీమ్‌ ఇండియా ఆదివారం 317 పరుగుల భారీ విజయం అందుకుంది అంటే దానికి కారణం మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) అనే చెప్పాలి. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) భారీ సెంచరీతో  అదరగొట్టినా.. సిరాజ్‌ వండర్‌ఫుల్‌ ‘ఫోర్‌’ కారణంగానే ఇంత భారీ విజయం వచ్చిందని చెప్పాలి. అయితే సిరాజ్‌ ఈ రోజు ‘పాంచ్‌’ పటాకా కొట్టాల్సిందే... కానీ మిస్‌ అయ్యింది. అయితే మ్యాచ్‌ అనంతరం సిరాజ్‌ ‘ఐదు’ వికెట్ల కోసం చేసిన ప్రయత్నాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

గత కొన్ని రోజులుగా నా రిథమ్‌ బాగుంది. నా ఆయుధం అవుట్‌స్వింగర్‌ అద్భుతంగా పని చేస్తోంది. కొత్తగా బంతిని లోపలకు మూవ్‌ చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ రోజు నాలుగు వికెట్లు పడగొట్టడం చాలా ఆనందంగా ఉంది. ఐదో వికెట్‌ తీయడానికి చాలా ప్రయత్నించాను కానీ కుదర్లేదు. మనకు ఎంత రాసిపెట్టి ఉంటే అంతే జరుగుతుంది అంటారు కదా.. అలా ఈ రోజు నాకు నాలుగు వికెట్లే రాసి పెట్టున్నాయేమో. రోహిత్‌ కూడా ‘ఐదు’  కోసం ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు

- సిరాజ్‌

391 పరుగుల విజయలక్ష్యంతో మూడో వన్డేలో బరిలోకి దిగిన శ్రీలంకను సిరాజ్‌ బేంబేలెత్తించాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో అవిష్క ఫెర్నాండోను పెవిలియన్‌కు పంపిన సిరాజ్‌.. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో కుశాల్‌ మెండీస్‌ను ఔట్‌ చేశాడు. నువనిదు ఫెర్నాండోను ఎనిమిదో ఓవర్‌లోను, హసరంగను పదో ఓవర్‌లోను సిరాజ్‌ పెవిలియన్‌కు పంపించాడు. తన ఆఖరి రెండు ఓవర్లలో ఆ ఐదో వికెట్‌ కోసం ట్రై చేసినా కసున్‌ రజిత, లహిరు కుమార ఆ అవకాశం ఇవ్వలేదు. ఆఖరి బంతికి అవకాశం వచ్చినా.. రివ్యూ తీసుకొని రజిత బతికిపోయాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని