WTC Final: సిరాజ్ బౌలింగ్‌లో లబుషేన్ బొటన వేలికి గాయం
టీమ్ఇండియా, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) జరుగుతోంది. సిరాజ్ బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్ లబుషేన్ బొటన వేలికి గాయమైంది.
ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా టీమ్ఇండియా, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ట్రావిస్ హెడ్ శతకం, స్టీవ్ స్మిత్ అర్ధ శతకాలతో రాణించారు. ప్రస్తుతం వీరిద్దరూ క్రీజులో కొనసాగుతున్నారు. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) మంచి వేగంతో బౌలింగ్ చేస్తూ కంగారూలను తొలుత ఇబ్బంది పెట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0)ను సిరాజ్ ఔట్ చేసి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన లబుషేన్ (Marnus Labuschagne)ను సిరాజ్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడ్డాడు.
సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్‌లో మొదటి బంతిని లబుషేన్ ఎదుర్కొన్నాడు. గంటకు 143 కి.మీ వేగం, ఎక్స్‌ట్రా బౌన్స్‌తో వచ్చిన ఆ బంతి లబుషేన్ ఎడమ చేతి బొటన వేలికి బలంగా తాకింది. ఈ సంఘటన జరిగినప్పుడు శుభ్‌మన్ గిల్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. లబుషేన్ వేలికి బంతి తాకడాన్ని చూసిన గిల్ ఏదో కామెంట్ చేశాడని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది ‘భారత్, ఆస్ట్రేలియా మధ్య యుద్ధం మొదలైంది’ అని కామెంట్లు చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో లబుషేన్ (26)ను షమి ఔట్ చేశాడు. రెండో సెషన్ ఆరంభమైన కొద్ది సేపటికే షమి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్