Siraj: ఆర్‌సీబీలో సిరాజ్‌దే ‘ఇంపాక్ట్‌’ పాత్ర: ఇర్ఫాన్

ఐపీఎల్ 16వ సీజన్‌లో (IPL 2023) ఆర్‌సీబీ బౌలర్‌ మహమ్మద్ సిరాజ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఆరు మ్యాచుల్లో 12 వికెట్లు తీసి జట్టు విజయాల్లో ప్రభావం చూపిస్తున్నాడు. 

Published : 23 Apr 2023 15:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) విజయాల్లో పేసర్ మహమ్మద్ సిరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. సిరాజ్‌ ప్రదర్శనపై పఠాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. పవర్‌ప్లే ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ వేస్తున్న సిరాజ్‌.. సరైన సమయంలో వికెట్లు తీసి జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆరు మ్యాచుల్లో 12 వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ 6.70. మూడు రోజుల కిందట పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ నాలుగు వికెట్లు తీసి ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

‘‘సిరాజ్‌ పవర్‌ప్లేలో అద్భుతంగా వేస్తున్నాడు. ఆర్‌సీబీ జట్టులో తన సత్తా ఏంటో చూపించాడు. గతేడాదితో పోలిస్తే సిరాజ్‌ బౌలింగ్‌లో భారీ మార్పులు వచ్చాయి. అందుకే, జట్టులో కీలకమైన పేసర్‌గా మారడం బాగుంది. ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకొనే అవకాశం ఉంది’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. 

ధోనీ నాయకత్వంపై క్రిష్ ప్రశంసలు

తన జట్టులోని ఆటగాళ్లను సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ నమ్ముతాడని, అదే విజయరహస్యమని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ (క్రిష్‌) వ్యాఖ్యానించాడు. అందుకే చెన్నై ఆటగాళ్ల నుంచి పూర్తిస్థాయి ప్రదర్శన రాబట్టగలుగుతున్నట్లు పేర్కొన్నాడు. సీనియర్ ఆటగాడు అజింక్య రహానెలోని సత్తాను బయటకు తీసుకొచ్చిన నాయకత్వ పటిమ అద్భుతమని కొనియాడాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని