IND vs ENG: మా జట్టులో అతడో యోధుడు: మహ్మద్‌ సిరాజ్

టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్‌ పుజారా యోధుడని పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమ్‌ఇండియా...

Published : 04 Jul 2022 15:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్‌ పుజారా యోధుడని పేస్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో టీమ్‌ఇండియా ఆధిపత్యం చలాయిస్తోన్న సంగతి తెలిసిందే. ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 125/3తో నిలిచి మొత్తం 257 పరుగుల ఆధిక్యం సాధించింది. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉండగా క్రీజులో ప్రస్తుతం పుజారా (50), పంత్‌ (30) ఉన్నారు. దీంతో జట్టు భారీ స్కోర్‌పైన కన్నేసింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం సిరాజ్‌ మాట్లాడుతూ పుజారా బ్యాటింగ్‌ను మెచ్చుకున్నాడు.

‘పుజారా యోధుడు. ఆస్ట్రేలియాలో ఆదుకున్నట్లే ఇక్కడా ఆదుకుంటున్నాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా అండగా నిలుస్తాడు. టీమ్‌ఇండియాను కాపాడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతడికి తగిన విధంగా బౌలింగ్‌ చేయడం చాలా కష్టం. పుజారా అటాకింగ్‌ షాట్లు ఆడకుండా.. బంతులను వదిలేస్తూ బౌలర్లను విసిగిస్తుంటాడు. నెట్స్‌లోనూ అదే పనిచేస్తాడు’ అని సిరాజ్‌ చెప్పుకొచ్చాడు. అనంతరం తాత్కాలిక కెప్టెన్‌ జస్ప్రిత్‌ బుమ్రాపై స్పందిస్తూ.. ‘ఒక ఆటగాడిగా, సారథిగా అతడిలో ఎలాంటి మార్పూ లేదు. ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. నాకు అవసరమైనప్పుడల్లా సాయం చేసేందుకు ముందుకొస్తాడు. ఎప్పుడైనా నేను బౌలింగ్‌ సరిగ్గా చేయకపోతే.. పరిస్థితులను వివరించి ఎలా బంతులేయాలో చెప్తాడు’ అని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని