Mohammed Siraj: సిరాజ్‌ బంతులా..బుల్లెట్లా..! విండీస్‌ టాప్‌ ఆర్డర్‌ కుదేల్‌..!

సిరాజ్‌ సూపర్‌ ఫామ్‌ కొనసాగుతోంది. ఇంగ్లాండ్ గడ్డపై చివరి వన్డేలో అదరగొట్టిన సిరాజ్‌..ఇప్పుడు విండీస్‌ సిరీస్‌లోనూ చెలరేగాడు.

Updated : 28 Jul 2022 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సిరాజ్‌ సూపర్‌ ఫామ్‌ కొనసాగుతోంది. ఇంగ్లాండ్ గడ్డపై చివరి వన్డేలో అదరగొట్టిన సిరాజ్‌..ఇప్పుడు విండీస్‌ సిరీస్‌లోనూ చెలరేగాడు. పదునైన స్వింగ్, పేస్‌తో అక్కడ టాప్‌ క్లాస్‌ బ్యాటర్లు బెయిర్‌స్టో, రూట్‌లను పెవిలియన్‌కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే, బుధవారం విండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో నిప్పులు చెరిగే బంతులను సంధించి విండీస్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లను ఔట్‌ చేశాడు.  ఈ మ్యాచ్‌లో తొలిత భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వర్షం పడటంతో ఇన్నింగ్స్‌ను  40 ఓవర్లకు కుదించారు. అయితే, టీమ్‌ఇండియా స్కోరు 36 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 225 పరుగులు ఉన్నప్పడు మళ్లీ వర్షం ప్రారంభమయ్యింది. అప్పటికే గిల్‌ 98 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. అయితే అంపైర్లు డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం విండీస్‌ లక్ష్యాన్ని35 ఓవర్లలో 257 పరుగులగా నిర్దేశించారు.

భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన విండీస్‌ను సిరాజ్‌ ఆరంభంలోనే దెబ్బతీశాడు. సిరాజ్‌ తన తొలి ఓవర్లలోనే మొదటి బంతికే ఓపెనర్‌ కైల్‌ మేయర్స్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. తరవాత బ్యాటింగ్‌కి వచ్చిన బ్రూక్స్‌ సిరాజ్‌ వేసిన మూడోబంతిని ఆడలేక వికెట్లముందు దొరికిపోయాడు. దీంతో టీమ్‌ఇండియా ఆరంభంలోనే విండీస్‌ను కట్టడిచేసింది. ఆ తరవాత చాహల్‌, ఠాకూర్‌ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంతో విండీస్‌ 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమ్‌ఇండియా 111 పరుగుల తేడాతో నెగ్గింది. కరేబియన్‌ గడ్డపై భారత్‌కు ఇదే అతిపెద్ద  విజయం కాగా తొలిసారి క్లీన్‌స్వీప్‌ కూడా ఇప్పుడే చేసి రికార్డు సృష్టించింది. అయితే, భారత టీ20లీగ్‌లో విఫలం అయిన సిరాజ్‌..టీమ్‌ఇండియా తరఫున సత్తాచాటి తిరిగి ఫామ్‌ను అందుకోవడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని