Published : 13 Apr 2022 01:18 IST

Shardul Thakur : ఎక్కువ మంది ఆల్ రౌండర్లు ఉండటం కలిసొచ్చే అంశం: శార్దూల్ ఠాకూర్

ఇంటర్నెట్ డెస్క్ : పొట్టి ఫార్మాట్లో ఎక్కువ మంది ఆల్ రౌండర్లు జట్టులో ఉండటం సానుకూల అంశమని శార్దూల్ ఠాకూర్ అన్నాడు. టీ20 మెగా టోర్నీలో దిల్లీ జట్టు తరఫున ఆడుతున్న శార్దూల్ ఇటు బంతితోనూ, అటు బ్యాటుతోనూ మెరుగైన ప్రదర్శన చేస్తోన్న విషయం తెలిసిందే. మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మన్‌దీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్ వంటి నాణ్యమైన ఆల్ రౌండర్లతో దిల్లీ జట్టు బలంగా కనిపిస్తోంది.

‘మా బ్యాటింగ్‌ విభాగం చాలా బలంగా ఉంది. టీ20 ఫార్మాట్లో ఎక్కువ మంది ఆల్ రౌండర్లు అందుబాటులో ఉండటం ఏ జట్టుకైనా కలిసొచ్చే అంశం. ఒకవేళ టాప్ ఆర్డర్‌ కుప్పకూలితే.. 6,7,8 స్థానాల్లో బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ల పాత్ర చాలా కీలకం. నేను ఆడే ప్రతి మ్యాచ్‌లో ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నాను. మా కోచ్ రికీ పాంటింగ్ నేతృత్వంలో మా జట్టు సరైన దిశలో ప్రయాణిస్తోంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహజ శైలిలో ఆడేందుకు ప్రయత్నించాలని మా కోచ్‌ ఎప్పుడూ చెబుతుంటాడు. ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడేందుకు పూర్తి మద్దతునిస్తాడు. కాబట్టి మేం కూడా వీలైనంత అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని శార్దూల్ ఠాకూర్‌ పేర్కొన్నాడు.

‘నేను ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. కాబట్టే, ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలుగుతున్నాను. మైదానాల్లో అభిమానులు మా ప్రత్యర్థి జట్టును ప్రోత్సాహిస్తున్నా ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తున్నాను’ అని శార్దూల్ ఠాకూర్‌ అన్నాడు. ప్రస్తుత టీ20 లీగ్‌లో దిల్లీ జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడగా.. రెండింట్లో గెలుపొందింది. మరో రెండు మ్యాచుల్లో ఓటమి పాలై.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని