Wasim Akram: నాలుగు ఓవర్లు ఆడినందుకే మీకు ఎక్కువ డబ్బులా..? : వసీం అక్రమ్‌

ఇటీవల వరుస సిరీస్‌లు ఓడిపోవడంపై పాక్‌(pakistan)పై ఇంటాబయటా విమర్శలు ఎక్కవవయ్యాయి. ఆటగాళ్ల తీరును మాజీలు తప్పుబడుతున్నారు. యువ పేసర్లపై వసీం అక్రమ్‌‌(Wasim Akram) మండిపడ్డాడు

Updated : 21 Jan 2023 13:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  పాకిస్థాన్‌(pakistan) క్రికెట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఓడిపోవడం.. అంతకుముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అవమానకరరీతిలో వైట్‌వాష్‌ కావడంతో బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని జట్టు ఆటతీరుపై పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌(Wasim Akram) యువ పేసర్ల ఆటతీరును తప్పుబట్టారు. టీ20లు, దేశీయ క్రికెట్‌లపై కాకుండా తమ ఆటతీరును మెరుగుపరుచుకోవడానికి సుదీర్ఘ ఫార్మాట్‌లపై దృష్టి పెట్టాలని సూచించాడు.

‘కేవలం నాలుగు ఓవర్లు ఆడినందుకే మీకు ఎక్కువ మొత్తంలో డబ్బు లభిస్తే.. అది సులభమైన నిర్ణయం. నసీమ్‌ షా, హరీస్‌ రవూఫ్‌, వసీం ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ ఆడాలి. పీఎస్‌ఎల్‌ కాకుండా.. వాళ్లు సంవత్సరంలో ఒకట్రెండు లీగ్‌లతో పాటు సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా ఆడాలి. ఆటపై దృష్టి పెట్టండి. సమయం ఉంటే.. నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడాలి’ అని ఓ ఛానల్‌తో మాట్లాడుతూ సూచించారు.

ఇక బాబర్‌ అజామ్‌ నాయకత్వంపై తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. అతడిని వెనకేసుకొచ్చే పయత్నం చేశాడు అక్రమ్‌. 28 ఏళ్ల బాబర్‌ అజామ్‌ భవిష్యత్తులో ఉత్తమ సారథిగా ఎదుగుతాడని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని