MS Dhoni:బర్త్ డే పార్టీలో క్రికెటర్లతో కలిసి డ్యాన్స్ చేసిన ధోనీ.. వీడియోలు వైరల్
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ దుబాయ్‌లో తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరై.. క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్‌లతో కలిసి డ్యాన్స్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత కుటుంబసభ్యులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అప్పుడప్పుడు వెకేషన్స్‌కి కూడా వెళ్తూ సేదతీరుతున్నాడు. తాజాగా ధోనీ బర్త్ డే పార్టీలో సందడి చేశాడు. దుబాయ్‌లో తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరైన ధోనీ.. టీమ్‌ఇండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, ఇషాన్ కిషన్‌లతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ బర్త్ డే పార్టీకి నలుపు రంగు సూట్, తెల్లటి చొక్కా ధరించి స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ప్రముఖ ర్యాపర్ బాద్‌షా పాటలు పాడుతుంటే ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యతో కలిసి ధోనీ అదిరిపోయే స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను ధోనీ సతీమణి సాక్షిసింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
న్యూజిలాండ్‌తో మూడు టీ20 సిరీస్‌కు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యని, ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఇషాన్ కిషన్‌ని ప్రస్తుతం కివీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దీంతో ఈ ఇద్దరూ క్రికెటర్లు నేరుగా దుబాయ్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ధోనీ స్నేహితుడి బర్త్ డే పార్టీకి హాజరయ్యారని అభిమానులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
General News
TSPSC: పేపర్ లీకేజీపై తాజా నివేదిక ఇవ్వండి: తమిళి సై
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Navjot Singh: సిద్ధూ భార్యకు క్యాన్సర్.. ‘ఇక వేచి ఉండలేనంటూ’ ట్వీట్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్