MS Dhoni: మహీ గొప్పతనం అదే!

ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం అందించడమే టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ గొప్పతనం అని ఆకాశ్‌ చోప్రా అన్నారు. రాణించే క్రికెటర్లకు నిలకడగా అవకాశాలు ఇవ్వడమే అతడి విజయాలకు కారణమని పేర్కొన్నారు. మహీ గెలిచిన మూడు ఐసీసీ టోర్నీలో ఇదే ధోరణి  కనిపించిందని వెల్లడించారు....

Published : 01 Jul 2021 01:20 IST

ఆటగాళ్లను అభద్రతాభావానికి గురి చేసేవాడు కాదు: ఆకాశ్‌ చోప్రా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం అందించడమే టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ గొప్పతనం అని ఆకాశ్‌ చోప్రా అన్నారు. రాణించే క్రికెటర్లకు నిలకడగా అవకాశాలు ఇవ్వడమే అతడి విజయాలకు కారణమని పేర్కొన్నారు. మహీ గెలిచిన మూడు ఐసీసీ టోర్నీల్లో ఇదే ధోరణి  కనిపించిందని వెల్లడించారు.

‘ధోనీ నాయకత్వంలో జట్టు ఎదిగింది. ఎక్కువ మార్పులు చేయకపోవడమే అతడిని ప్రపంచంలోనే అత్యుత్తమ సారథిగా మార్చింది. అతడు ఎవరినీ అభద్రతా భావానికి గురిచేసేవాడు కాదు’ అని ఆకాశ్ అన్నారు.

‘లీగ్‌ దశ నుంచి నాకౌట్‌ వరకు మహీ జట్టును పరిశీలిస్తే కీలక బృందం ఒకేలా ఉంటుంది. మ్యాచుల్లో పరుగులు చేయగల వారే అందులో ఉంటారు. తక్కువ పొరపాట్లు చేసే జట్టు క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్‌ గెలుస్తుంది. ఆటగాళ్ల చోటుపై అభద్రతాభావం లేని జట్టే నిలకడగా రాణిస్తుంది’ అని ఆకాశ్‌ తెలిపారు.

ధోనీ సారథ్యంలోని ఏ జట్టును చూసినా ఎవరో ఒక ఆటగాడు గుర్తుండి పోతాడని ఆకాశ్‌ చోప్రా అన్నారు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనళ్లలో గౌతమ్‌ గంభీర్‌ గుర్తుండి పోతాడని తెలిపారు. 2011 ప్రపంచ కప్‌ టోర్నీ మొత్తంగా యువరాజ్‌సింగ్‌ గుర్తుంటాడని వెల్లడించారు. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో నిలకడగా రాణించిన ఆటగాళ్లు ఉన్నారని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని