
MS Dhoni: అదిరిపోయే కొత్త లుక్‌లో ధోనీ..
కుటుంబంతో సహా సిమ్లా టూర్..
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ కొత్తలుక్‌లో అదిరిపోయాడు. ఐపీఎల్ 14వ సీజన్ వాయిదాపడటంతో కొద్ది రోజులుగా రాంచీలోని తన ఫామ్‌హౌజ్‌లో సేదతీరిన ధోనీ ఇప్పుడు కుటుంబంతో వెకేషన్‌కు వెళ్లాడు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కొవిడ్-19 నిబంధనల్లో ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయడంతో కుటుంబంతో సహా మహీ ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లాకు వెళ్లాడు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొద్దిరోజులు భార్యా, బిడ్డలతో విశ్రాంతి తీసుకోనున్నాడు.
సిమ్లా టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను జీవా, సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. అక్కడ వారు నివసించబోయే ఇల్లు, పరిసర ప్రాంతాల వీడియోలను కూడా పోస్టు చేశారు. అయితే.. ధోనీ, జీవా ఓ కొండపై నిల్చొని తీసుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. తన గారాల పట్టీతో కలిసి దిగిన ఆ ఫొటోలో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మీసం మెలేసి చిరునవ్వుతో ఫోజిచ్చాడు. మహీని ఇలా చూడటం చాలా బాగుందని అభిమానులు సంబరపడుతున్నారు.
మరోవైపు ఈఏడాది భారత్‌లో నిర్వహించిన ఐపీఎల్ 14వ సీజన్ బయోబుడగలో పలువురు ఆటగాళ్లు కరోనా వైరస్ బారినపడటంతో మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పుడు 29 మ్యాచ్‌లు జరగ్గా ఇంకా 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. అయితే, వాటిని సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. దాంతో మరో మూడు నెలల్లో మహీ మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు. కాగా, ఈ సీజన్లో చెన్నై ఏడు మ్యాచ్‌ల్లో తలపడగా ఐదు విజయాలు సాధించి పది పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, ఈ సీజన్ పూర్తయ్యాక చెన్నై సారథి వచ్చే ఏడాది ఐపీఎల్లో కొనసాగుతాడో లేదోననే సంగతి వెల్లడిస్తాడని ప్రచారం జరుగుతోంది. మరి మహీ ఏం చేస్తాడో వేచిచూడాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.