MS Dhoni: డీఆర్‌ఎస్‌ (DRS).. అభిమానులు అలా పిలుస్తారని ధోనీకి తెలుసు: సురేశ్ రైనా

అభిమానులు డీఆర్‌ఎస్‌ (DRS) ని ధోనీ రివ్యూ సిస్టమ్  అని పిలుస్తారనే విషయం ధోనీకి తెలుసని భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) అన్నాడు.   

Published : 19 Jan 2023 20:25 IST

ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni).. భారత క్రికెట్ చరిత్రలోని దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. క్యాచ్‌లు పట్టడం, వేగంగా స్టంపింగ్‌లు చేయడం, ఎల్బీడబ్ల్యూలు కచ్చితంగా అంచనా వేయడం, పాదరసంలా కదులుతూ రనౌట్లు చేయడంలో ధోనీని మించిన వారు లేరు. ధోనీ రివ్యూ తీసుకున్నాడంటే అది కచ్చితంగా ఔట్‌ అని సదరు ఆటగాడితోపాటు అభిమానులు ఫిక్సయిపోతారు. ఇలాంటి వాటిని ఎన్నోసార్లు మన కళ్లారా చూశాం.  ఈ నేపథ్యంలో డీఆర్‌ఎస్‌ (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్) పై ధోనీకి ఉన్న అపారమైన పరిజ్ఞానం గురించి  భారత మాజీ ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) మాట్లాడాడు.   

‘అభిమానులు డీఆర్‌ఎస్‌ (DRS)ని ధోనీ రివ్యూ సిస్టమ్‌గా పిలుస్తారనే విషయం ధోనీకి తెలుసు. నాక్కూడా ప్రతీసారి అదే పేరు గుర్తొస్తుంది. ఆ తర్వాతే దాని అసలు పేరు (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) అని తెలుసుకున్నా. ధోనీ ఎప్పుడూ రివ్యూని చివరి క్షణంలో తీసుకుంటాడు. ఎందుకంటే బౌలర్‌ అది కచ్చితంగా ఔట్‌ అని భావిస్తాడు. కానీ, వికెట్ల వెనక ఉండే ధోనీకి మూడు స్టంప్స్‌ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ధోనీ సరైన నిర్ణయం తీసుకుంటాడు’ అని రైనా పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా సరదాగా మాట్లాడుతూ.. వికెట్‌ కోసం ధోనీ అప్పీల్ చేశాడా లేదా అని విషయాన్ని అంపైర్లు గమనిస్తారన్నాడు. ‘ధోనీ అప్పీల్ చేశాడా లేదా అని అంపైర్లు గమనిస్తారని నేను భావిస్తున్నా. ధోనీ అప్పీల్ చేశాడంటే అది కచ్చితంగా ఔట్‌’ అని ఓజా అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని