MS Dhoni: అందుకే ధోనీ అందరికీ ఇష్టం

మాజీ సారథి ఎంఎస్‌ ధోనీపై టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించాడు. కుర్రాళ్లకు అతడు మార్గనిర్దేశం చేస్తాడని తెలిపాడు. అందరికీ సాయం చేస్తాడని పేర్కొన్నాడు. అందుకే అందరూ అతడిని ఇష్టపడతారని వెల్లడించాడు. ..

Published : 01 Jul 2021 12:00 IST

కుర్రాళ్లకు మార్గనిర్దేశం చేస్తాడన్న భువనేశ్వర్‌

ముంబయి: మాజీ సారథి ఎంఎస్‌ ధోనీపై టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించాడు. కుర్రాళ్లకు అతడు మార్గనిర్దేశం చేస్తాడని తెలిపాడు. అందరికీ సాయం చేస్తాడని పేర్కొన్నాడు. అందుకే అందరూ అతడిని ఇష్టపడతారని వెల్లడించాడు. మహీ గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ మరుసటి రోజు సోషల్‌ మీడియాలో పంచుకున్న చిత్రం గురించి భువీ వివరించాడు.

‘మహీ భాయ్‌ వీడ్కోలు పలికినప్పుడు నేనా చిత్రం పోస్ట్‌ చేశాను. అతనెలాంటి ఆటగాడో అందరికీ తెలుసు. కానీ, అతడో గొప్ప మానవతావాది. అందుకే నేను ధోనీ గురించి పోస్ట్‌ చేశాను. మీరు ఎవరితోనైనా ధోనీ గురించి అడిగారంటే అతనెంత సహాయకారో చెబుతారు. కుర్రాళ్లందరికీ అతడు మార్గనిర్దేశం చేస్తాడు’ అని భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు.

ధోనీ సారథ్యంలో భువీ ఎదిగాడు. మెరుగైన పేసర్‌గా ఆకట్టుకున్నాడు. 73 మ్యాచుల్లో 87 వికెట్లు పడగొట్టాడు. సగటు 36.71, ఎకానమీ 4.43 కావడం గమనార్హం. ప్రస్తుతం భువీ శ్రీలంక పర్యటనలో ఉన్నాడు. త్వరలో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసులో ఆడనున్నాడు. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌కు సాయపడేందుకు వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసే భువీ ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపికవ్వకపోవడం ఇబ్బందికరంగా మారింది. తరచూ గాయాల పాలవుతుండటంతో ఇంగ్లాండ్‌ సిరీసుకు పరిగణనలోకి తీసుకోలేదు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts