
IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ షురూ!
(Photo:CSK Twitter)
ఇంటర్నెట్ డెస్క్: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-14 సీజన్ తిరిగి ప్రారంభంకాబోతోంది. బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది కరోనాబారిన పడటంతో మే మొదటివారంలో ఈ మెగా టోర్నీ వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఎన్నో సమాలోచనల అనంతరం మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగే పోరుతో మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. దీంతో పలు ఫ్రాంచైజీలు బయోబుడగలను ఏర్పాటు చేసి తమ ఆటగాళ్లను యూఏఈకి తరలిస్తున్నాయి.
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టులోని పలువురు ఆటగాళ్లు ఆగస్టు 13న యూఏఈకి చేరుకున్నారు. అనంతరం నేరుగా క్వారంటైన్లోకి వెళ్లారు. ప్రస్తుతం క్వారంటైన్ పూర్తికావడంతో ధోనీ సేన ప్రాక్టీస్‌ను మొదలెట్టింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎస్కే తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
ఐపీఎల్ 13 సీజన్లో ఆశించినమేరకు ఆకట్టుకోలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్లో జోరుమీదుంది. ఐపీఎల్ వాయిదాపడే నాటికి ఏడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.