MS Dhoni: ఎంఎస్ ధోనీ.. చెన్నై పగ్గాలు వదిలేశాడు
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్. అప్పటికే భారత కెప్టెన్‌గా ధోని ఎన్నో ఘనతలు సాధించాడు. కానీ అనూహ్యంగా...
జడేజాకు సారథ్యం
2014... ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్. అప్పటికే భారత కెప్టెన్‌గా ధోని ఎన్నో ఘనతలు సాధించాడు. కానీ అనూహ్యంగా కోహ్లీకి టెస్టు పగ్గాలు అందించాడు. 2017.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మహీ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. కానీ అన్ని ఫార్మాట్లలోనూ విరాట్‌కే బాధ్యతలు అప్పగిస్తూ కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. 2022.. గతేడాది కెప్టెన్‌గా చెన్నైకి నాలుగో టైటిల్ అందించిన ధోని తనదైన శైలిలో అందరికి షాకిస్తూ ఈసారి సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు.. జడేజా చేతికి స్టీరింగ్ అందించాడు. కెప్టెన్‌గా ఎంతో సాధించిన ధోని ఇక ఓ ఆటగాడు మాత్రమే. అతని మహోజ్వల నాయకత్వ శకానికి తెరపడింది.
ముంబయి
టీ20 మెగా లీగ్ ఆరంభానికి ముందే చెన్నై అభిమానులకు షాక్. 2008లో లీగ్ ఆరంభం నుంచి చెన్నైకు ఆడిన అన్ని సీజన్లలోనూ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోని ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 12 సీజన్ల (మధ్యలో ఫిక్సింగ్ కారణంగా రెండు సీజన్ల పాటు జట్టుపై వేటు)లో జట్టును నడిపించిన ధోని.. నాలుగు సార్లు టైటిల్ అందించాడు. మరో అయిదు సార్లు జట్టును ఫైనల్ చేర్చాడు. ఇప్పుడేమో జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న జడేజాపై నమ్మకంతో అతని చేతికి పగ్గాలు అందించాడు. ‘‘చెన్నై సారథ్య బాధ్యతలను జడేజాకు అప్పగించాలని ధోని నిర్ణయించుకున్నాడు. 2012 నుంచి చెన్నైలో భాగమైన జడేజా ఈ జట్టును నడిపించే మూడో కెప్టెన్. ఈ సీజన్లోనూ, భవిష్యత్‌లోనూ ధోని చెన్నై తరపున ఆడతాడు’’ అని గురువారం సీఎస్కే ప్రకటించింది. ధోని గైర్హాజరీలో కొన్ని మ్యాచ్‌ల్లో రైనా ఆ జట్టుకు నాయకత్వం వహించాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు 40 ఏళ్ల ధోని వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. 2007లో భారత అండర్-19 జట్టు కెప్టెన్‌గా పని చేసిన జడేజాకు ఓ సీనియర్ జట్టు సారథ్య అవకాశం దక్కడం ఇదే తొలిసారి. ‘‘ధోని ఏ నిర్ణయం తీసుకున్నా అది జట్టు ప్రయోజనాల కోసమే. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తాం. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అతను జట్టును నడిపించే శక్తిగా కొనసాగుతాడు. ఇదే అతని చివరి సీజన్ అనుకోవడం లేదు’’ అని సీఈవో విశ్వనాథన్ పేర్కొన్నాడు. ధోని కెప్టెన్సీలో జట్టు రెండు సార్లు ఛాంపియన్స్ లీగ్ టీ20లోనూ విజేతగా నిలిచింది.
ఇదే చివరి సీజన్?: జట్టు ప్రయోజనాల కోసం అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం ధోనికి అలవాటే. తన సారథ్యంలో కోహ్లీని సానబెట్టిన అతను మొదట టెస్టు కెప్టెన్సీని అతనికి అప్పజెప్పాడు. ఆ తర్వాత అన్ని ఫార్మాట్ల బాధ్యతలను అతని చేతుల్లో పెట్టాడు. ఇప్పుడు మెగా టోర్నీలోనూ గత కొన్ని సీజన్లుగా తర్వాతి కెప్టెన్‌గా జడేజాను తీర్చిదిద్దిన ధోని.. ఇప్పుడు అకస్మాత్తుగా ఆ పగ్గాలు అందించాడు. ఈ సీజన్లో చెన్నై తొలి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు ధోని ఈ నిర్ణయం ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. ఇప్పటికే అతను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గత రెండు సీజన్లుగా కేవలం ఐపీఎల్‌లోనే ఆడుతున్నాడు. 41వ ఏట అడుగుపెట్టబోతున్న ధోని.. ఫిట్నెస్ కాపాడుకుంటూ వరుసగా అన్ని మ్యాచ్‌లు ఆడడం అనుమానమే. ఇప్పుడు జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పిన ధోని ఈ సీజన్‌తోనే ఆటగాడిగా కెరీర్ ముగించినా ఆశ్చర్యం లేదు.
చెన్నై కెప్టెన్ అవడం సంతోషంగా ఉంది. కానీ ధోని లోటును భర్తీ చేయాల్సిన అతిపెద్ద బాధ్యత నాపై ఉంది. ఇప్పటికే మహీ భాయ్ ఘనమైన వారసత్వాన్ని నెలకొల్పాడు. దాన్ని మేం కొనసాగించాల్సి ఉంది. ఇప్పుడు ధోని జట్టులోనే ఉన్నాడు కాబట్టి నేనెక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- జడేజా
4
ధోని సారథ్యంలో చెన్నై గెలిచిన టైటిళ్లు. 2010, 2011, 2018, 2021లో జట్టు విజేతగా నిలిచింది. 2010, 2014లో ఛాంపియన్స్‌లీగ్ టీ20 టైటిళ్లను సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి