MS Dhoni: వారెవ్వా.. అదిరిపోయే ధోనీ న్యూ లుక్‌ చూశారా?

MS dhoni: మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ న్యూ హెయిర్‌స్టైల్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Published : 28 Jun 2024 15:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మిస్టర్‌ కూల్‌ ధోనీకి (MS Dhoni) ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అంతాఇంతా కాదు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో లోయర్‌ ఆర్డర్‌లో వచ్చి.. వరుస సిక్సర్లు, ఫోర్లు బాదినప్పుడు మైదానమంతా ‘ధోనీ’ స్లోగన్స్‌తో మారుమోగి పోయింది. అతడికి క్రికెట్‌తోపాటు ఫ్యాషన్‌పైనా మక్కువ ఎక్కువే. అందుకే తరచూ హెయిర్‌స్టైల్‌ మారుస్తూ.. సరికొత్తగా కనిపిస్తుంటాడు. ఐపీఎల్‌ సీజన్‌లో లాంగ్‌ హెయిర్‌తో ఉన్న ధోనీ.. తాజాగా స్టైల్‌ మార్చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రముఖ హెయిర్‌ స్టైలిస్ట్‌ ఆలిమ్‌ హకీం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

‘‘మన యంగ్‌ డైనమిక్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ’’ అంటూ క్యాప్షన్‌ పెట్టాడు. తొలి గంటలోనే 50 వేల మందికిపైగా ఈ పోస్టును వీక్షించారు. హాలీవుడ్‌ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు గుప్పిస్తున్నారు. క్రికెట్‌ అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. ఇదివరకు టాప్‌ ఆర్డర్‌లో క్రీజులోకి వచ్చి ఎడపెడా బాదేసిన ఈ రాంచీ డైనమైట్‌.. 2024 ఐపీఎల్‌లో మాత్రం లోయర్‌ ఆర్డర్‌లోనే బ్యాటింగ్‌కు దిగాడు. 220 స్ట్రైక్‌ రేటుతో 161 పరుగులు చేశాడు. 2025 ఐపీఎల్‌లో ఆడాలని ఫ్యాన్స్‌ అంతా కోరుకుంటున్నా.. అతడు కొనసాగిస్తాడా? బ్రేక్‌ చెబుతాడా అన్నదానిపై స్పష్టత లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని