Dhoni: 13 ఏళ్ల అభిమాని కల నిజం చేసిన ధోనీ
టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ తాజాగా ఓ అభిమాని కలను నిజం చేశాడు. 13 ఏళ్లుగా తనని కలవాలని చూస్తున్న అతడిని కలవడమే కాకుండా ఫొటోలు, ఆటోగ్రాఫ్ ఇచ్చి మరీ సంబరపడేలా చేశాడు...
సతీమణి సాక్షికి అరుదైన బహుమతి
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ తాజాగా ఓ అభిమాని కలను నిజం చేశాడు. 13 ఏళ్లుగా తనని కలవాలని చూస్తున్న అతడిని కలవడమే కాకుండా ఫొటోలు, ఆటోగ్రాఫ్ ఇచ్చి మరీ సంబరపడేలా చేశాడు. మహీ ప్రస్తుతం కుటుంబంతో సహా హిమాచల్ ప్రదేశ్‌లోని రత్నారి అనే ప్రాంతంలో విహారయాత్రకు వెళ్లాడన్న సంగతి తెలిసిందే. అక్కడ మీనాబాగ్ అనే హోటల్లో ప్రత్యేకంగా విడిది చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తున్న హోటల్ సిబ్బందిని కలిసిన ధోనీ వారితో కాసేపు సంతోషంగా ముచ్చటించాడు. ఆ విషయాలను మీనాబాగ్ హోటల్ యాజమాన్యం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పంచుకుంది.
‘ధోనీకి దగ్గరుండి సపర్యలు చేసేందుకు దేవ్ అనే మా సిబ్బంది ఒకరు సిమ్లాలోని మీనాబాగ్ హోటల్స్ నుంచి రత్నారిలోని మీనాబాగ్కు కావాలనే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. 2008లో ధోనీ ఒకసారి క్రికెట్ టోర్నీలో భాగంగా హిమాచల్‌కు వచ్చినప్పుడు దేవ్ ఎలాగైనా కలవాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ, చివరికి పోలీసులతో దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు తనకిష్టమైన క్రికెటర్‌ను కలిసేందుకు సిమ్లా నుంచి ఇక్కడికి ఉద్యోగ మార్పు చేసుకున్నాడు. ధోనీని కలిశాక తన ఫోన్ కవర్‌పై ఆటోగ్రాఫ్ తీసుకోగా.. దాన్ని ఎప్పుడూ మార్చనని చెప్పాడు’ అని పేర్కొంది.
మరోవైపు ఆదివారం ధోనీ, సాక్షిల 11వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిద్దరూ ఈ ప్రత్యేకమైన రోజును మరింత తీపిగుర్తుగా జరుపుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే మహీ తన ప్రియమైన భార్యకు ఓ అరుదైన బహుమతి ఇచ్చాడు. సాక్షి దాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకోవడం గమనార్హం. ఇంతకీ ఆ బహుమతేంటో తెలుసా? ఆమెకెంతో ఇష్టమైన వింటేజ్ కారు. పాతకాలం నాటి అంబాసిడర్ కారును మహీ బహుకరించాడు. కాగా, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ట్విటర్లో ఈ స్టార్ జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పింది. ‘మా రాజు, రాణికి సూపర్ హ్యాపీ యానివర్సరీ’ అని పేర్కొంటూ వారిద్దరు ఎక్కడో ప్రయాణిస్తున్న ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్‌లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్‌లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్‌గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
కోల్‌కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్‌లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్‌రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్‌కు మారు పేరు! సన్‌రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్‌రేట్‌లో ఎప్పుడూ వెనుకంజే! సన్‌రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్‌లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్‌కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్‌కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్‌తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్‌తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్‌కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్‌కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్‌గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు