IPL 2022: బస్సు డ్రైవర్‌గా మారిన ధోనీ.. వైరల్ అవుతున్న వీడియో
ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్నటీ20 లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రస్థానంలో ఉంటుంది. అనేక దేశాల్లో ఈ లీగ్‌కి కోట్లలో అభిమానులున్నారు. ఖరీదైన టీ20 లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ మరో సీజన్‌తో
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉన్న టీ20 లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్రస్థానంలో ఉంటుంది. అనేక దేశాల్లో ఈ లీగ్‌కి కోట్లలో అభిమానులున్నారు. ఖరీదైన టీ20 లీగ్‌గా పేరొందిన ఐపీఎల్ మరో సీజన్‌తో అలరించేందుకు సిద్ధమైంది. మార్చి 26 నుంచి ఐపీఎల్-15వ సీజన్ ప్రారంభంకానుంది. రెండు, మూడు రోజుల్లో మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎప్పటిలాగే నిర్వాహకులు విభిన్న ప్రచార చిత్రాలతో అభిమానులను సర్ప్రైజ్ చేస్తున్నారు.
ఈ సారి ప్రచార చిత్రంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. దీంట్లో ధోనీ ఖాకీ రంగు దుస్తులు ధరించి బస్సు డ్రైవర్‌గా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఐపీఎల్ తన అధికారిక ట్విటర్లో పంచుకుంటూ కొత్త సీజన్లో ఏం ఆశిస్తున్నారు? అని అడిగింది. ఈ వీడియోలో ధోనీ బస్సు నడుపుకొంటూ వెళ్తుండగా ఓ షాప్‌లో ఐపీఎల్ మ్యాచ్ ప్రసారం అవుతుంది. దీన్ని గమనించిన ధోనీ.. బస్సును వెంటనే వెనక్కి తీసుకెళ్లి నిలిపివేస్తాడు. బస్సులో ఉన్న ప్రయాణికులకు మ్యాచ్ చూడమని సలహా ఇస్తాడు. బస్సు నిలిపివేయడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహన చోదకులు అవస్థలు పడతారు. ఆ సమయంలో ఓ ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఇక్కడ ఏం జరుగుతోంది..? అని ప్రశ్నించగా ‘సూపర్ ఓవర్ నడుస్తోంది’ అంటూ ధోనీ తన స్టైల్లో మైక్‌లో సమాధానమిస్తాడు. దీంతో ట్రాఫిక్ పోలీస్ ‘ఒకే తలైవా’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది. ఆ వీడియోని మీరూ చూసేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్‌లో అత్యుత్తమ కోచ్‌ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్‌పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్‌కు వెళ్లి కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్‌దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్‌లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్‌రైడర్స్ కోచ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్‌ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్‌కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్‌కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’