MS Dhoni: ‘అప్పుడే ఏడాదయిందా నమ్మలేకపోతున్నాం’

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ప్ర

Published : 16 Aug 2021 01:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ప్రకటించి అప్పుడే ఏడాది గడిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం (2020 ఆగస్టు 15)న రాత్రి 7 గంటల 29 నిమిషాలకు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెబుతున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించి అభిమానులకు షాక్‌ ఇచ్చాడు ధోనీ. ‘కెరీర్ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు.19.29 గంటల నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి’ అని ఓ వీడియోని ధోనీ అప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

ధోనీ రిటైర్మెంట్ విషయాన్ని గుర్తు చేస్తూ  ‘నాయకుడు, దిగ్గజం, స్ఫూర్తిదాయకుడు’ అనే వ్యాఖ్యను జతచేస్తూ ధోనీ ఫొటోని బీసీసీఐ ట్వీట్‌ చేయగా.. ‘ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఒక సంవత్సరం అయ్యిందని నమ్మలేకపోతున్నాం’ అంటూ కెరీర్‌లో ధోనీ  సాధించిన ఘనతలను తెలియజేసే విధంగా  ఉన్న ఫొటోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ట్వీట్‌ చేసింది.

కెప్టెన్‌ కూల్‌గా పేరొందిన ధోనీ..భారత్‌కు ఎన్నో మరుపురాని విజయాలనందించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2010, 2016 ఆసియా కప్‌లు, 2011 ప్రపంచకప్‌తోపాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలు ధోనీ సారథ్యంలో అందుకున్నవే.  2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనలే ధోనీకి అంతర్జాతీయ చివరి మ్యాచ్‌. ఇందులో రనౌటయిన ధోనీ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని