కుల్‌దీప్‌ ఎంపికలో పక్షపాతమా?

టీమ్‌ఇండియాలో ఆశ్రిత పక్షపాతానికి చోటులేదని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. సారథి విరాట్‌ కోహ్లీ సైతం వ్యక్తిగత కోణంలో ఆలోచించే రకం కాదని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో కుల్‌దీప్‌కు చోటివ్వకపోవడానికి కారణం మరేదైనా ఉంటుందని వెల్లడించారు.....

Published : 11 Feb 2021 17:57 IST

కోహ్లీ అలా ఆలోచించడన్న ఎమ్మెస్కే ప్రసాద్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాలో ఆశ్రిత పక్షపాతానికి చోటులేదని మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. సారథి విరాట్‌ కోహ్లీ సైతం వ్యక్తిగత కోణంలో ఆలోచించే రకం కాదని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో కుల్‌దీప్‌కు చోటివ్వకపోవడానికి కారణం మరేదైనా ఉంటుందని వెల్లడించారు.

మణికట్టు మాంత్రికుడు, చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు చాలాకాలంగా జట్టులో చోటు దొరకడం లేదు. వాస్తవంగా రెండేళ్లుగా అతడు అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఐపీఎల్‌లోనూ వికెట్లేమీ తీయలేదు. టీమ్‌ఇండియాకు ఎంపిక చేస్తున్నప్పటికీ తుది జట్టులోకి తీసుకోవడం లేదు. ఆస్ట్రేలియా సిరీసులో సీనియర్లు లేనప్పటికీ అవకాశం దొరకలేదు. చెపాక్‌ టెస్టులోనూ అతడిని రిజర్వు బెంచీకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో జట్టు యాజమాన్యంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.

‘వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తావులేదు. విరాట్‌ సైతం అలా ఆలోచిస్తాడని అనుకోను. ఎంపికకు సంబంధించి కోహ్లీ, జట్టు యాజమాన్యానికి భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు. ఆసీస్‌తో ఆఖరి టెస్టులో వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుతంగా ఆడాడు. బౌలింగ్‌ చేయగల అదనపు బ్యాట్స్‌మన్‌ అవసరమని వారు ఆలోచించారేమో’ అని ఎమ్మెస్కే అన్నారు.

‘నదీమ్‌ విషయానికి వస్తే శ్రీలంకలో ఎడమ చేతివాటం బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఇబ్బంది పడ్డారని గణాంకాలు చూపిస్తున్నాయి. ఆ సిరీస్‌లో వారు గెలిచినప్పటికీ ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఎక్కువ వికెట్లు తీశారు. అందుకే జట్టు యాజమాన్యం నదీమ్‌కు ప్రాధాన్యం ఇచ్చుంటుంది. వ్యక్తిగతంగా కుల్‌దీప్‌ను ఎంపిక చేసేందుకే నేను ఓటేస్తాను. నదీమ్‌ జట్టులోకి ఎంపికయ్యేందుకు కారణం మాత్రం బహుశా ఇదే’ అని ప్రసాద్‌ తెలిపారు. రెండో టెస్టులో కుల్‌దీప్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

ఇవీ చదవండి
అడగ్గానే నటరాజన్‌ను ఇచ్చారు
ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు