Dravid: రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా ద్రవిడ్‌ ఉండాలి: ఎమ్మెస్కే 

ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమ్‌ఇండియాకి కొత్త హెడ్ కోచ్ రాబోతున్నాడు. రెండో పర్యాయం కోచ్‌గా కొనసాగుతున్న రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14న ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌ని ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తు మొదలెట్టింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్‌ మూడీ,

Updated : 13 Oct 2021 11:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమ్‌ఇండియాకి కొత్త హెడ్ కోచ్ రాబోతున్నాడు. రెండో పర్యాయం కోచ్‌గా కొనసాగుతున్న రవిశాస్త్రి పదవీకాలం నవంబరు 14తో ముగియనుంది. దీంతో కొత్త కోచ్‌ని ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్‌ మూడీ, భారత మాజీ కెప్టెన్‌ అనిల్ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా ఎవరు ఉంటే బాగుంటుందనే అంశంపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్, సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కూడా ఈ అంశంపై స్పందించారు.  రవిశాస్త్రి తర్వాత హెడ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్, మెంటార్‌గా టీమ్ఇండియా మాజీ సారథి ఎం.ఎస్.ధోనీ ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన అనంతరం కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌, మెంటార్‌గా ధోనీ ఉండాలి. వీరిద్దరూ భారత జట్టులో భాగంగా ఉంటే చూడటానికి అద్భుతంగా ఉంటుంది’ అని ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు.

ద్రవిడ్ ఇప్పటికే కోచ్‌గా నిరూపించుకున్నాడు. ఆయన శిక్షణలోనే 2018లో టీమ్‌ఇండియా అండర్‌-19 ప్రపంచ కప్‌ని సాధించింది. ఇండియా-ఏ జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించి అనేక విజయాలనందించాడు. ఈ ఏడాది జులైలో శిఖర్ ధావన్‌ నాయకత్వంలో టీమ్‌ఇండియా శ్రీలంకలో పర్యటించింది. అప్పుడు కూడా ద్రవిడే కోచ్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉండగా, యూఏఈ, ఒమన్‌ వేదికగా అక్టోబర్‌ 17 నుంచి 2021 టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. అక్టోబరు 24న పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్‌ని ఆడనుంది. ఈ మెగా టోర్నీ అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ టోర్నీ అనంతరం కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం కూడా ముగుస్తుండటంతో టీ20 ప్రపంచకప్‌ని గెలిచి వీరిద్దరికి కానుకగా ఇవ్వాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని