Arjun Tendulkar: ‘అందుకే అర్జున్‌ తెందూల్కర్‌ని ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించలేదు’

టీ20 లీగ్‌లో గత రెండు సీజన్లలో సచిన్‌ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్ ముంబయి జట్టులో ఉంటున్న విషయం తెలిసిందే. కానీ, ఈ రెండేళ్ల ఒక్కసారి కూడా అర్జున్‌ తెందూల్కర్‌ని తుది జట్టులోకి తీసుకోలేదు ముంబయి.

Published : 04 Jun 2022 01:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌లో గత రెండు సీజన్లలో సచిన్‌ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్ ముంబయి జట్టులో ఉంటున్న విషయం తెలిసిందే. కానీ, ఈ రెండేళ్లలో ఒక్కసారి కూడా అర్జున్‌ తెందూల్కర్‌ని తుది జట్టులోకి తీసుకోలేదు ముంబయి. ఇటీవల ముగిసిన టీ20 లీగ్‌లో ముంబయి జట్టు పేలవ ప్రదర్శన కనబరిచి అందరికంటే ముందుగానే ప్లే ఆఫ్స్‌ నుంచి తప్పుకుంది. దీంతో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ల్లో ముంబయి కొంతమంది కొత్త ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం కల్పించింది. అర్జున్‌ తెందూల్కర్‌ కూడా అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ, అలా జరగలేదు. అర్జున్‌ తెందూల్కర్‌ని ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులోకి తీసుకోకపోవడానికి గల కారణాన్ని ముంబయి బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌ వెల్లడించాడు. అర్జున్‌ తెందూల్కర్‌ తుది జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటే బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, అందుకే అతడిని ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకోలేదని షేన్‌ బాండ్‌ వివరించాడు.      

‘అతడు (అర్జున్‌ తెందూల్కర్‌) చేయాల్సిన పని ఇంకా కొంచెం మిగిలి ఉంది. ముంబయి లాంటి జట్టు కోసం ఆడుతున్నప్పుడు, జట్టును తయారు చేయడం ఒక ఎత్తైతే.. తుది జట్టుని ఎంపిక చేయడం మరో ఎత్తు. అర్జున్‌ తెందూల్కర్‌ ఇంకా చాలా కష్టపడి అభివృద్ధి చెందాల్సి ఉంది. అతడు తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి కంటే ముందు తన బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై దృష్టిసారించాలి. అతడు  పురోగతిని సాధించి తుది జట్టులో స్థానం సంపాదించుకుంటాడని ఆశిస్తున్నా’ అని షేన్‌ బాండ్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని