
Rohit Sharma: రోహిత్ శర్మ ఆ ఫామ్‌ని ఉపయోగించుకోవాలి: సాబా కరీమ్
(Photo:Mumbai IndiansTwitter)
ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్-14 సీజన్ రెండో దశలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫామ్‌ను ఉపయోగించుకోవాలని భారత మాజీ వికెట్ కీపర్ సాబా కరీమ్ అన్నాడు. రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్‌గా రాణిస్తే అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగి కెప్టెన్‌గా విజయవంతమవుతాడని పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపుపొందిన రోహిత్ శర్మ.. ముంబయి ఇండియన్స్‌ను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
‘రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో మెరుగుదల అవసరం. అతడి కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ ఐపీఎల్‌లో ఐదుసార్లు విజేతగా నిలిచింది. అది వేరే విషయం. ఆ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లున్నారు. అందుకే రోహిత్ తన ప్రదర్శన గురించి పట్టించుకోలేదు. కానీ, జట్టులో అతడు కీలక బ్యాట్స్‌మన్. విచిత్రమైన విషయం ఏమిటంటే.. ఐపీఎల్ ప్రారంభమయ్యే ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి ఫామ్‌లో ఉంటున్న ఈ ఆటగాడు టోర్నీలో మాత్రం విఫలమవుతున్నాడు’ అని సాబా కరీమ్ అన్నాడు.
‘ఒక ఆటగాడు కెప్టెన్సీకి ఎక్కువ సమయం కేటాయిస్తే బ్యాటింగ్‌పై దృష్టిపెట్టలేడని భావిస్తా. అయితే, ఒక బ్యాట్స్‌మన్ కెప్టెన్‌గా ఉంటే మన ప్రధాన కర్తవ్యం బ్యాటింగ్‌లో రాణించడమే. రోహిత్ శర్మకు కూడా బ్యాటింగ్‌లో రాణిస్తే అది అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి కెప్టెన్‌గా మరింత రాణించేందుకు సహకరిస్తుంది. ఈ ఐపీఎల్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్ మారుతుందని భావిస్తున్నా’ సాబా కరీమ్ ముగించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.