IPL 2021: ఆ స్టార్‌ ఆటగాళ్లు వచ్చేశారు..

యూఏఈ వేదికగా మరో రెండు రోజుల్లో ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశ ప్రారంభంకాబోతోంది.దీంతో  ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ఆటగాళ్లతోపాటు కొంతమంది విదేశీ ఆటగాళ్లు  యూఏఈకి

Published : 17 Sep 2021 23:46 IST

(Photo: Mumbai Indians Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: యూఏఈ వేదికగా మరో రెండు రోజుల్లో ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశ ప్రారంభంకాబోతోంది. టోర్నీలో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ఆటగాళ్లతో పాటు కొంతమంది విదేశీ ఆటగాళ్లు యూఏఈకి చేరుకున్నారు. వీరిలో కొంతమంది క్వారంటైన్‌ పూర్తి చేసుకుని వారి జట్టులో కలిశారు. మరికొంతమంది ఇంకా క్వారంటైన్‌లో ఉన్నారు. కాగా, మ్యాచ్‌లకు సమయం దగ్గరపడుతుండటంతో ఇంకా యూఏఈకి చేరుకోని విదేశీ ఆటగాళ్లను రప్పించేందుకు ఫ్రాంచైజీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ముంబయి ఇండియన్స్‌ జట్టు ప్రధాన ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కీలక ఆటగాళ్లు డ్వాన్ బ్రావో, డుప్లెసిస్‌, ఇమ్రాన్‌ తాహీర్‌ శుక్రవారం యూఏఈకి చేరుకున్నారు. 

అక్కడి నిబంధనల ప్రకారం వీరంతా ఆరురోజుల క్వారంటైన్‌ అనంతరం జట్లలో కలవాల్సి ఉంటుంది. దీంతో ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌కు ఈ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం అనుమానమే. ఐపీఎల్ వాయిదాపడేనాటికి ఏడు మ్యాచులు ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ముంబయి ఇండియన్స్‌ ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో నెగ్గి నాలుగో స్థానంలో ఉంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని