IPL 2021: క్వారంటైన్‌ ముగియగానే ముంబయి ఆటగాళ్లు ఎక్కడికెళ్లారంటే..? 

ఐపీఎల్ సందడి మళ్లీ మొదలైంది. వచ్చే నెల 19న యూఏఈ వేదికగా ఈ టోర్నీ తిరిగి ప్రారంభంకానుంది. మ్యాచ్‌లకు సమయం దగ్గరపడుతుండటంతో

Published : 20 Aug 2021 23:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్ సందడి మళ్లీ మొదలైంది. వచ్చే నెల 19న యూఏఈ వేదికగా ఈ టోర్నీ తిరిగి ప్రారంభం కానుంది. మ్యాచ్‌లకు సమయం దగ్గరపడుతుండటంతో ఆటగాళ్లను యూఏఈకి తరలించడంపై ఫ్రాంచైజీలు దృష్టిసారించాయి. ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే), ముంబయి ఇండియన్స్‌ జట్లలోని కొంతమంది ఆటగాళ్లు ఆగస్టు  13న యూఏఈకి చేరుకున్నారు.

వారం రోజుల క్వారంటైన్‌ ముగియడంతో సీఎస్కే ఆటగాళ్లు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొనగా... ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లు స్విమ్మింగ్ ఫూల్‌లో వాలీబాల్‌ (ఫూల్‌ వాలీబాల్‌) ఆడి సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబయి ఇండియన్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో ఇషాన్‌ కిషన్‌, పీయూష్ చావ్లా, ఆదిత్య తారె, ధవళ్‌ కులకర్ణితోపాటు పలువురు ఆటగాళ్లు వాలీబాల్ ఆడుతూ కనిపించారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

బయోబుడగలో ఉన్న ఆటగాళ్లు, సిబ్బంది కొవిడ్ బారినపడటంతో మే మొదటివారంలో ఐపీఎల్-14 సీజన్‌ అర్ధంతరంగా వాయిదాపడిన సంగతి తెలిసిందే. అనేక సమాలోచనల అనంతరం మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబరు 19న దుబాయ్‌ వేదికగా ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే పోరుతో మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం అవుతాయి. ఐపీఎల్ వాయిదాపడే  నాటికి ఏడు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ ఏడు మ్యాచ్‌లు ఆడి 4 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని