WPL: హర్మన్‌ అర్ధశతకం.. గుజరాత్‌ టార్గెట్‌ ఫిక్స్‌

డబ్ల్యూపీఎల్‌లో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

Updated : 14 Mar 2023 21:35 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌లో భాగంగా గుజరాత్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ముంబయి జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌కౌర్‌ (51; 30 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), యాస్తిక భాటియా (44; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), నాట్ సీవర్ (36; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అమేలియా కెర్‌ (19) పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో ఆష్లీన్‌ గార్డ్‌నర్ 3, కిమ్‌ గార్త్, స్నేహ్‌ రాణా, తనుజ కన్వర్ తలో వికెట్ పడగొట్టారు.

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే  ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ (0)ను గార్డ్‌నర్‌ పెవిలియన్‌కు పంపింది.హేలీ.. డంక్లీకి క్యాచ్‌ ఇచ్చింది. తర్వాత క్రీజులోకి వచ్చిన నాట్‌ సీవర్‌తో జోడీ కట్టిన మరో ఓపెనర్‌ యాస్తిక ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ నిలకడగా ఆడటంతో 10 ఓవర్లకు స్కోరు 64/1గా నమోదైంది. 11 ఓవర్‌లో వరుసగా ఫోర్‌, సిక్స్‌ బాది జోరుమీదున్న నాట్‌ సీవర్‌ని కిమ్‌ గార్త్‌ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపింది. అర్ధ శతకం దిశగా సాగుతున్న యాస్తిక స్నేహ్‌రాణా బౌలింగ్‌లో రనౌట్‌ అయింది. తనుజ వేసిన 17 ఓవర్‌లో చివరి బంతికి అమేలియా కిమ్‌ గార్త్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటైంది. ఇస్సీ వాంగ్ (0), కాజీ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు. గార్డ్‌నర్  వేసిన చివరి ఓవర్లో నాలుగో బంతికి హర్మన్‌.. హర్లీన్ డియోల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌ చేరగా.. తర్వాతి బంతికే అమన్‌జ్యోత్‌ (0) డంక్లీకి చిక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని