MIW vs RCBW: ముంబయి ఇండియన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తు..
డబ్ల్యూపీఎల్ (WPL)ను ఓటమితో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తన చివరి లీగ్ మ్యాచ్‌ను కూడా పరాజయంతోనే ముగించింది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL)ను ఓటమితో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తన చివరి లీగ్ మ్యాచ్‌ను కూడా పరాజయంతోనే ముగించింది. ఆర్సీబీపై ముంబయి ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ముంబయి 16.3 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి ఛేదించింది. అమేలియా కెర్ (31*; 27 బంతుల్లో 4 ఫోర్లు), యాస్తికా భాటియా (30; 26 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు.హేలీ మాథ్యూస్ (24; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించింది. నాట్ సీవర్ (13) పరుగులు చేయగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (2) విఫలమైంది. పూజా వస్త్రాకర్ (19; 18 బంతుల్లో 2 ఫోర్లు) పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో కనికా అహుజా రెండు, మేఘన్ స్కట్, శ్రేయంకా పాటిల్, ఎల్లీస్ పెర్రీ, ఆశా శోభనా ఒక్కో వికెట్ పడగొట్టారు.
తొలుత ముంబయి బౌలర్ల ధాటికి ఆర్సీబీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఎల్లీస్ పెర్రీ (29; 38 బంతుల్లో 3 ఫోర్లు), రిచా ఘోష్ (29; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించకపోతే బెంగళూరు 100 కూడా దాటకపోయేది. స్మృతి మంధాన (24) ఫర్వాలేదనిపించగా.. సోఫీ డివైన్ డకౌట్ అయింది. హెథర్ నైట్ (12), కనికా అహుజా (12) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. శ్రేయంకా పాటిల్ (4), మేఘన్ స్కట్ (2), దిశా కాసాట్ (2) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో అమేలియా కెర్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాట్ సీవర్, ఇస్సీ వాంగ్ రెండేసి వికెట్లు తీశారు. సైకా ఇషాక్ ఒక వికెట్ పడగొట్టింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: అత్త గొంతుకోసి, మామ తల పగులగొట్టి అల్లుడు పరార్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్లు ఫ్రీ.. నిర్మాత అభిషేక్ కీలక ప్రకటన.. వారికి మాత్రమే
-
India News
Viral Video: యువతిని కిడ్నాప్ చేసి ఎడారిలో ‘సప్తపది’.. పోలీసులేం చెప్పారంటే?
-
General News
AP News: సాధారణ బదిలీల్లో మినహాయింపుపై ఆ లేఖలు పరిగణనలోకి తీసుకోవద్దు: జీఏడీ
-
General News
Hyderabad: ‘నాపై కేసు కొట్టివేయండి’.. హైకోర్టులో నటి డింపుల్ హయాతి పిటిషన్