MIW vs DCW: ముగిసిన ముంబయి ఇన్నింగ్స్.. దిల్లీ లక్ష్యం 110
దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసింది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL 2023)లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (23), పూజా వస్త్రాకర్ (26), వాంగ్ (23), అమన్‌జోత్ కౌర్ (19) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దిల్లీ బౌలర్లలో మరిజన్నె, షిఖా పాండే,జోనాసేన్ తలో 2 వికెట్లు తీయగా.. అరుంధతి రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు. ప్రారంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన దిల్లీ జట్టు ముంబయిని స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది.
బ్యాటింగ్ ప్రారంభించిన ముంబయికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు యాస్తికా భాటియా (1), హెయిలీ మ్యాథ్యూస్ (5) తీవ్ర నిరాశపరిచారు. మరిజన్నె వేసిన మూడో ఓవర్ తొలి బంతికే తనియా భాటియాకు క్యాచ్ ఇచ్చి యాస్తికా భాటియా వెనుదిరిగింది. ఆ తర్వాతి బంతికే ఫస్ట్‌డౌన్‌లో వచ్చిన బ్రంట్ (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరింది. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద షిఖాపాండే వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఓపెనర్ హెయిలీ మ్యాథ్యూస్ ఔటయ్యింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసింది. అమీలా కేర్ (8) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగింది. ఆ తర్వాత పూజా వస్త్రాకర్, ఓవగ్, అమన్‌జోత్ కౌర్ మోస్తరు ప్రదర్శన చేయడంతో ముంబయి ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Nayanthara: ఆనాడు దర్శకుడికి కోపం తెప్పించిన నయనతార.. ‘నువ్వు రావొద్దు’ అని చెప్పేసిన డైరెక్టర్
-
Crime News
Hyderabad: టీచర్, రాజేశ్ చనిపోవాలనుకున్నారు?.. పోలీసుల చేతికి కీలక ఆధారాలు
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్ కారుపై పుష్ అప్స్ తీస్తూ యువకుడి హల్చల్!