Mumbai Indians: జస్ప్రీత్ బుమ్రా స్థానంలో డొమిస్టిక్ ప్లేయర్.. ఎవరంటే?
గాయపడి సీజన్‌కు దూరమైన బుమ్రా స్థానంలో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) కీలక నిర్ణయం తీసుకుంది. టీ20ల్లో అనుభవం ఉన్న మీడియం పేసర్‌ను తీసుకుంది. ఈ మేరకు ఐపీఎల్ (IPL 2023) నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ప్రారంభానికి ముందే ఆయా ఫ్రాంచైజీలకు గాయాల బెడద తప్పలేదు. కొందరు కీలక ఆటగాళ్లు సీజన్ మొత్తం మిస్ అవుతుండగా.. మరికొందరు కొన్ని మ్యాచ్‌ల తర్వాత జట్టుతో పాటు చేరిపోతారు. భారత స్టార్ ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్ ఐపీఎల్ 16వ సీజన్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రిషభ్ పంత్ స్థానంలో దిల్లీ క్యాపిటల్స్ అభిషేక్ పోరెల్‌ను ఎంపిక చేసుకుంది. తాజాగా బుమ్రా స్థానంలో సందీప్ వారియర్‌ను ముంబయి ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది.
ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ముంబయి ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ క్రమంలో బుమ్రా రిప్లేస్‌మెంట్‌కు సంబంధించి ముంబయి నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆసియా కప్ నుంచే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్న బుమ్రాకు మరింత విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉంది. ఆ తర్వాత కీలకమైన వన్డే ప్రపంచకప్ ఉండటంతో బుమ్రా విషయంలో రిస్క్ తీసుకొనేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో ముంబయి ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ నాయకత్వంలోని పేస్ దళంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో భారత్ తరఫున రెండేళ్ల కిందట అరంగేట్రం చేసి ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన అనుభవం ఉన్న సందీప్ వారియర్‌ను తీసుకుంది. అయితే దేశవాళీలో 68 టీ20లను ఆడాడు. 2012లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన 31 ఏళ్ల మీడియం పేసర్ అయిన సందీప్ డొమిస్టిక్ క్రికెట్‌లో 62 వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Papam Pasivadu Review: రివ్యూ: పాపం పసివాడు.. సింగర్ శ్రీరామ చంద్ర నటించిన వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
-
Nara Lokesh - AP High Court: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన విచారణ
-
TCS: భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్ టీసీఎస్
-
ODI WC 2023: సూర్యకు వన్డేల్లో గొప్ప గణాంకాలు లేవు.. తుది జట్టులో తీవ్ర పోటీ: సన్నీ
-
పైకి లేచిన బ్రిడ్జ్.. కిందికి దిగలేదు: లండన్ ఐకానిక్ వంతెన వద్ద ట్రాఫిక్ జామ్
-
USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్ ఊసెత్తని అమెరికా..!