IPL 2021: ముంబయి ఇవాళైనా ఖాతా తెరిచేనా?

MI vs PBKS: టాస్‌ గెలిచి పంజాబ్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించిన ముంబయి

Published : 28 Sep 2021 19:53 IST

అబుదాబి: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో ముంబయి ఇండియన్స్‌ అభిమానులకు ఇప్పటి వరకైతే నిరాశే. కారణం ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ముంబయి ఒక్కటీ గెలువకపోడం. ఇవాళ్టి పంజాబ్‌తో మ్యాచ్‌లోనైనా ముంబయి గెలుస్తుందా?లేదా? అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబయి ఛేజింగ్‌కు మొగ్గుచూపింది. దీంతో ప్రత్యర్థి పంజాబ్‌ బ్యాటింగ్‌కు సిద్ధమవుతోంది.  ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతున్నా.. ప్లేఆఫ్స్‌ చేరాలంటే ముంబయి మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌తో సహా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఏ ఒక్కటి ఓడినా ముంబయి ప్లేఆఫ్‌కు వెళ్లడం కష్టమే. 

ముంబయి ఇండియన్స్‌ జట్టు..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), డికాక్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్‌, సౌరభ్‌ తివారీ, కృనాల్‌ పాండ్య, హర్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, నాథన్‌ కౌల్టర్‌ నైల్‌, రాహుల్‌ చాహర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌

పంజాబ్‌ కింగ్స్‌ జట్టు..

కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మన్‌దీప్ సింగ్‌, గేల్‌, మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, దీపక్‌ హుడా, హర్‌ప్రీత్‌ బ్రర్‌, నాథన్‌ ఎలీస్‌, మహమ్మద్‌ షమి, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్‌ సింగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు