MIw Vs UPw: ముంబయి ఇండియన్స్‌ని కట్టడి చేసిన యూపీ వారియర్స్‌

కీలకమైన మ్యాచ్‌లో యూపీ బౌలర్లు అదరగొట్టారు. ముంబయిని తక్కువ పరుగులకే కట్టడి చేశారు. దీంతో యూపీ బ్యాటర్లు రాణిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది.

Published : 18 Mar 2023 17:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (WPL 2023)లో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ బౌలర్లు రాణించారు. పటిష్ఠమైన ముంబయి జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేశారు. టాస్ నెగ్గిన యూపీ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హీలీ మ్యాథ్యూస్ (35), కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ (25), వాంగ్‌ (32) మినహా ఎవరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. యాస్తికా భాటియా 7 పరుగులు, నాట్‌ స్కివెర్ 5, అమేలీ కెర్ 3, అమన్‌జోత్ కౌర్ 5, హమైరా కాజీ 4, ధారా గుజ్జర్ 3, కలిత 3 (నాటౌట్‌) నిరాశపరిచారు.

సోఫీ సూపర్‌ బౌలింగ్‌ 

అద్భుతమైన బ్యాటర్లు ఉన్న ముంబయి భారీ స్కోరు సాధించకుండా అడ్డుకోవడంలో యూపీ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్‌ (3/15) కీలక పాత్ర పోషించింది. కీలక వికెట్లను పడగొట్టింది. ఆమెకు తోడుగా రాజేశ్వరి గైక్వాడ్ 2, దీప్తి శర్మ 2, అంజలి శర్వాని ఒక వికెట్‌ తీశారు. ఇద్దరు బ్యాటర్లు రనౌట్‌గా వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని