
IPL 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్), ముంబయి ఇండియన్స్ జట్లు మరి కొద్ది సేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే.. ఇటు రాజస్థాన్, అటు ముంబయి తప్పనిసరిగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అందుకే, ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఓ అడుగు ముందుకేసి తదుపరి మ్యాచ్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు..
ఎవిన్ లూయిస్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), శివమ్ దూబె, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రహ్మాన్
ముంబయి ఇండియన్స్ జట్టు..
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్య, జేమ్స్ నీషమ్, కీరన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్ నైల్, జయంత్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.