Murali Vijay: అంతర్జాతీయ క్రికెట్‌కు మురళీ విజయ్‌ వీడ్కోలు

టీమ్‌ ఇండియా వెటరన్‌ బ్యాటర్‌ మురళీ విజయ్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతడు  తన రిటైర్‌మెంట్‌ను సోమవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు.

Published : 30 Jan 2023 21:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ ఇండియా వెటరన్‌ బ్యాటర్‌ మురళీ విజయ్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతడు తన రిటైర్‌మెంట్‌ను సోమవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. తమిళనాడుకు చెందిన విజయ్‌ భారత ఓపెనింగ్ విభాగంలో అత్యంత స్టైలిష్‌ బ్యాటర్లలో ఒకడు. ప్రొఫెషనల్ క్రికెటర్‌గా అతడు 2002లో కెరీర్‌ ప్రారంభించాడు. 61 టెస్టులు ఆడి 12 సెంచరీలు, 15 అర్ధశతకాలు సాధించాడు. 3,982 పరుగులతో అతడి సగటు 38.28గా ఉంది. ఐపీఎల్‌లోనూ తనదైన ముద్ర వేసుకున్న మురళీ విజయ్‌..  చెన్నై తరఫున 106 మ్యాచ్‌లు ఆడి 2,619 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో అతడి స్ట్రైక్‌ రేట్‌ 121.87. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని అతడు పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో, సంబంధిత వ్యాపార రంగంలో కొత్త అవకాశాలను అన్వేషిస్తానని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు