Hardik Pandya: అందరి కంటే నాపైనే పనిభారం ఎక్కువ: హార్దిక్ పాండ్య
ఒక ఆల్‌రౌండర్‌గా జట్టులో అందరికంటే రెండు, మూడింతల పనిభారం తనపైనే ఎక్కువగా ఉంటుందని టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ సూపర్-4లో భాగంగా సెప్టెంబరు 10న భారత్, పాకిస్థాన్ (IND vs PAK) తలపడనున్నాయి. ఈ టోర్నీ గ్రూప్ దశలో దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైన వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) (87) కీలక ఇన్నింగ్స్‌తో సత్తాచాటాడు. అతడిప్పుడు సూపర్-4 మ్యాచ్‌లో రాణించడంపై దృష్టిపెట్టాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్య స్టార్‌స్పోర్ట్స్‌తో ముచ్చటించాడు. ఒక ఆల్‌రౌండర్‌గా జట్టులో అందరికంటే రెండు, మూడింతల పనిభారం తనపైనే ఎక్కువగా ఉంటుందన్నాడు.
ఒకవేళ ధోనీ లెప్ట్‌హ్యాండ్‌తో బ్యాటింగ్ చేస్తే ఇలా ఉంటుందా..! సోషల్ మీడియాలో వీడియో వైరల్
‘‘ఒక ఆల్ రౌండర్‌గా అందరికంటే నా పనిభారం రెండు, మూడింతలు ఉంటుంది. జట్టులోని ఒక బ్యాటర్ పని బ్యాటింగ్ చేసేంత వరకే. కానీ, నేను బ్యాటింగ్ చేసిన తర్వాత బౌలింగ్ కూడా చేయాలి. కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రీ-క్యాంప్ సీజన్‌లో శిక్షణ తీసుకుంటా. ప్రతి మ్యాచ్‌కు జట్టుకు ఏదైతే అవసరం ఉంటుందో దానిపైనే ఎక్కువ దృష్టిపెడతా. నేను 10 ఓవర్లు బౌలింగ్ చేయాల్సిన అవసరం లేనప్పుడు అన్ని ఓవర్లు బౌలింగ్ చేయడంలో అర్థం లేదు. ఒకవేళ టీమ్ మేనేజ్‌మెంట్ నన్ను 10 ఓవర్లు బౌలింగ్ చేయాలని చెబితే ఆ మేరకు బౌలింగ్ చేస్తా. జట్టు అవసరాన్ని బట్టి ముందుకు సాగుతా. ఆటను అర్థం చేసుకుంటూ మనపై మనం నమ్మకం ఉంచాలి. అవే మనల్ని విజయం దిశగా నడిపిస్తాయి’’ అని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు.
భారత్‌తో మ్యాచ్.. పాక్ అదే జట్టుతో
సెప్టెంబరు 10న భారత్‌తో జరగనున్న సూపర్-4 మ్యాచ్ కోసం పాకిస్థాన్ తమ తుది జట్టును ప్రకటించింది. ఈ కీలకమైన మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా పాత జట్టుతోనే బరిలోకి దిగనుంది. గ్రూప్ దశలో టీమ్ఇండియాతో ఏ జట్టుతో బరిలోకి దిగిందో అదే జట్టులో సూపర్-4లో తలపడనుంది.
భారత్‌తో మ్యాచ్‌కు పాక్ తుది జట్టు:
బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అఘా, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫహీమ్ అష్రఫ్, నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది, హారీస్ రవూఫ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
భారత్‌కు తిరిగి రానున్న శివాజీ ‘పులి గోళ్లు’!
-
‘సీఎం ఇంటికి కూతవేటు దూరంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం’
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్