Daniil Medvedev: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లోకి మెద్వెదెవ్‌.. నాదల్‌తో తుది పోరు

రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. శుక్రవారం రసవత్తరంగా సాగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో అతడు గ్రీస్‌ ఆటగాడు స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ని 7-6, 4-6, 6-4...

Published : 28 Jan 2022 23:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రష్యాకు చెందిన టెన్నిస్‌ ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. శుక్రవారం రసవత్తరంగా సాగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో అతడు గ్రీస్‌ ఆటగాడు స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ని 7-6, 4-6, 6-4, 6-1 తేడాతో ఓడించాడు. ఆదివారం జరుగనున్న ఫైనల్ మ్యాచ్‌లో అతడు స్పెయిన్‌ దిగ్గజం రఫేల్‌ నాదల్‌తో తలపడనున్నాడు. గత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో కూడా మెద్వెదెవ్‌ ఫైనల్‌కి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, నొవాక్‌ జకోవిచ్‌తో జరిగిన తుదిపోరులో అతడు 7–5, 6–2, 6–2 తేడాతో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచాడు.

మరోవైపు స్పెయిన్‌ దిగ్గజం రఫేల్ నాదల్‌ ఇప్పటికే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన తొలి సెమీ ఫైనల్లో అతడు.. ఇటలీకి చెందిన ఏడో సీడ్‌ బెరెటినీని 6-3, 6-2, 3-6, 6-3 తేడాతో ఓడించాడు. ప్రస్తుతం నాదల్ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో‌.. రోజర్‌ ఫెదరర్‌, నోవాక్‌ జకోవిచ్‌లతో సమానంగా కొనసాగుతున్నాడు. ఆదివారం జరుగనున్న ఫైనల్‌ పోరులో విజయం సాధిస్తే 21 గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లు సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని