Nagle: ప్రిక్వార్టర్స్‌లో నగాల్‌

ఏటీపీ 125 పెరుగియా ఛాలెంజర్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సుమిత్‌ నగాల్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్లో ఆరో సీడ్‌ నగాల్‌ 7-6 (7-1), 6-2తో నెర్మన్‌ ఫాటిక్‌ (బోస్నియా)పై విజయం సాధించాడు.

Published : 12 Jun 2024 04:13 IST

పెరుగియా (ఇటలీ): ఏటీపీ 125 పెరుగియా ఛాలెంజర్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు సుమిత్‌ నగాల్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్లో ఆరో సీడ్‌ నగాల్‌ 7-6 (7-1), 6-2తో నెర్మన్‌ ఫాటిక్‌ (బోస్నియా)పై విజయం సాధించాడు. హోరాహోరీ పోరులో తొలి సెట్‌ను గెలుచుకున్న నగాల్‌.. రెండో సెట్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. అతడు రెండో రౌండ్లో స్థానిక ఆటగాడు గియానెసితో తలపడతాడు. ఈ విజయంతో నగాల్‌ కెరీర్‌లోనే అత్యుత్తమంగా 73వ ర్యాంకుకు చేరుకోనున్నాడు. అతడు ఇప్పటికే పారిస్‌ ఒలింపిక్స్‌లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని