Published : 02 Nov 2021 21:21 IST

T20 World Cup 2021: రాణించిన బాబర్, రిజ్వాన్‌‌.. నమీబియా ముందు భారీ లక్ష్యం..

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ సూపర్‌-12 దశలో భాగంగా అబుదాబి వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. నమీబియా ముందు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ ఓపెనర్లు బాబర్‌ అజామ్‌ (70), మహమ్మద్‌ రిజ్వాన్‌ (79) అర్థ శతకాలతో రాణించారు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వైజ్‌, జాన్‌ ఫ్రై లింక్‌ తలో వికెట్ తీశారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌.. నెమ్మదిగా ఆరంభించింది. పది ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్‌ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. ఓపెనర్లు బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ రిజ్వాన్‌ నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే రుబెన్‌ ట్రంపుల్మన్ వేసిన 12వ ఓవర్లో బాబర్ అజామ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వేగం పెంచి దూకుడుగా ఆడుతున్న సమయంలో.. డేవిడ్ వైజ్‌ వేసిన 15వ ఓవర్లో జాన్‌ ఫ్రై లింక్‌కి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫకార్ జమాన్ (5) విఫలమయ్యాడు. అతడి తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహమ్మద్‌ హఫీజ్‌ (32) ధాటిగా ఆడాడు. నమీబియా బౌలర్లు ఆరంభంలో కట్టుదిట్టంగా బంతులేసినా.. ఆఖర్లో తేలిపోయారు. దీంతో పాకిస్థాన్‌ భారీగా పరుగులు రాబట్టింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని