TATA IPL 2023: ఐపీఎల్‌ వ్యాఖ్యాతగా నందమూరి బాలకృష్ణ

‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమంతో వ్యాఖ్యాతగా మారిన బాలకృష్ణ ఈ సారి క్రీడాభిమానులను కూడా అలరించనున్నారు.

Published : 26 Mar 2023 21:55 IST

హైదరాబాద్‌: మాస్‌లో అశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna). ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమంతో వ్యాఖ్యాతగా మారిన ఆయన ఈ సారి క్రీడాభిమానులను కూడా అలరించనున్నారు. త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్‌-2023 సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. స్కూల్‌, కాలేజ్‌ డేస్‌ నుంచి తనకు క్రికెట్‌ అంటే ఎంతో మక్కువ అని, ఇప్పుడు ఇలా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నారు. ‘స్టార్ స్పోర్ట్స్ తెలుగుతో కలిసి పనిచేస్తున్నందుకు ఓ క్రికెట్ అభిమానిగా సంతోషిస్తున్నా. కుటుంబ స‌భ్యులు, స్నేహితుల‌తో క‌లిసి బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్‌ చూస్తూ సంతోషంగా గ‌డిపిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఇక తెలుగు అభిమానులు న‌న్ను స్టార్‌స్పోర్ట్స్‌లో చూడొచ్చు. ఈ సీజ‌న్ మ‌నంద‌రికీ ప్రత్యేకంగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాను’’ అని బాలకృష్ణ అన్నారు. టాక్‌షోను అదరగొట్టిన బాలకృష్ణ ఇప్పుడు తెలుగు కామెంటరీ బాక్స్, స్టూడియోకి కూడా అదే స్థాయి చరిష్మా తీసుకురాగ‌ల‌ర‌ని ఆశిస్తున్నట్లు స్టార్ స్పోర్ట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్‌ ప్రారంభంకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు