Published : 25 May 2022 23:30 IST

IOA: భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా రాజీనామా

దిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఐఓఏ అధ్యక్ష పదవికి తాను మళ్లీ పోటీ చేయనని స్పష్టం చేశారు. అయితే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) చీఫ్‌గా మాత్రం కొనసాగనున్నట్లు వెల్లడించారు. దేశంలో హాకీ అభివృద్ధికి మరిన్ని విప్లవాత్మక మార్పులు, నిర్ణయాలు అవసరం అని, ప్రేక్షకుల్లో హాకీ పట్ల ఆదరణను పెంచేందుకు కృషి చేస్తానని బాత్రా పేర్కొన్నారు. అందుకే ఐఓఏ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

‘భారత ఒలింపిక్ సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నా. ఈ పదవికి మళ్లీ పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా. కొత్త ఆలోచనలతో వచ్చే యువ రక్తం ఈ స్థానాన్ని భర్తీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నా. ఐఓఏ అధ్యక్షుడిగా ఇన్నాళ్లపాటు సేవలందించడాన్ని గౌరవంగా భావిస్తున్నా. భారత క్రీడాభివృద్ధే ధ్యేయంగా పనిచేశా. గత నాలుగేళ్లుగా నాకు మద్దతునిచ్చిన వారందరికీ ధన్యవాదాలు’ అంటూ నరీందర్ బాత్రా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. హాకీ ఇండియా నిధులు రూ.35 లక్షల దుర్వినియోగం చేసినట్టు బాత్రాపై అభియోగాలున్నాయి. దీనిపై సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. నిధులు దుర్వినియోగం చేశారంటూ బాత్రాపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని