ఇంగ్లాండ్‌ అలా చేస్తే.. టీమ్‌ఇండియాపై ఒత్తిడి!

నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధిస్తే టీమ్‌ఇండియా ఒత్తిడికి గురవుతుందని పర్యాటక జట్టు మాజీ సారథి నాసర్‌ హుసేన్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 04 Mar 2021 01:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ సాధిస్తే టీమ్‌ఇండియా ఒత్తిడికి గురవుతుందని పర్యాటక జట్టు మాజీ సారథి నాసర్‌ హుసేన్‌ అభిప్రాయపడ్డాడు. చివరి మ్యాచ్‌లో ఆ జట్టు విజయం సాధించే అవకాశం ఉందని.. అలా జరగాలంటే తొలి టెస్టులాగే ఇప్పుడు కూడా తొలి ఇన్నింగ్స్‌లో 200 స్కోర్‌ చేయాలని హుసేన్‌ అన్నాడు. తాజాగా ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన కథనంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.

‘నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం సాధించాలంటే తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోర్‌ సాధించడం ఒక్కటే మార్గం. గడిచిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఆ జట్టు 200 స్కోర్‌ దాటలేదు. పింక్‌బాల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో అలా చేసి ఉంటే, ఆ మ్యాచ్‌ గెలిచే అవకాశం ఉండేది. తొలి టెస్టులాగే ఇప్పుడు కూడా ఇంగ్లాండ్‌ తొలుత భారీ స్కోర్‌ చేసి తర్వాత ఇద్దరు స్పిన్నర్లను బరిలోకి దించితే టీమ్‌ఇండియా ఒత్తిడికి గురవుతుంది. ఈ సిరీస్‌లో రూట్‌కు ఇంకా నమ్మకముంది. ఇంగ్లాండ్‌ తమ బ్యాటింగ్‌ టెంపోను తిరిగి సొంతం చేసుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఆడాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్రీజులో ఫుట్‌వర్క్‌ను మెరుగుపర్చుకోవాలి’ అని హుసేన్‌ సూచించాడు. 

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు