Navdeep Saini - Washington Sundar: కౌంటీ క్రికెట్‌లో భారత బౌలర్లు ఘనంగా అరంగేట్రం..

భారత బౌలర్లు నవ్‌దీప్‌ సైని, వాషింగ్టన్‌ సుందర్‌ ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో ఘనంగా అరంగేట్రం చేశారు. ఇద్దరూ ఇక్కడ తొలిసారి ఆడుతుండగా వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు...

Published : 22 Jul 2022 02:11 IST

(Photos: Kent, Lancashire cricket clubs twitter)

లండన్‌: భారత బౌలర్లు నవ్‌దీప్‌ సైని, వాషింగ్టన్‌ సుందర్‌ ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో ఘనంగా అరంగేట్రం చేశారు. ఇద్దరూ ఇక్కడ తొలిసారి ఆడుతుండగా వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ అరంగేట్రం మ్యాచ్‌ల్లో చెరో ఐదు వికెట్లతో అదరగొట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇటీవల ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత జట్టుకు నెట్‌బౌలర్‌గా సేవలందించిన నవ్‌దీప్‌ సైని ఇప్పుడు కెంట్‌ జట్టు తరఫున ఫాస్ట్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే వార్విక్‌షైర్‌ జట్టుతో తలపడిన సందర్భంగా అతడు అరంగేట్రం  చేసి ఐదు వికెట్ల ప్రదర్శన (5/72) చేసి కెంట్‌ జట్టును ఆకట్టుకున్నాడు. అతడు బెంజమెన్‌ (7), మోస్లీ (0), మైఖేల్‌ బుర్గ్స్‌ (0), బ్రూక్స్‌ (6), క్రేగ్‌ మిల్స్‌ (4)లను పెవిలియన్‌ పంపాడు. దీంతో వార్విక్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులకు ఆలౌటైంది.

మరోవైపు వాషింగ్టన్‌ సుందర్‌ సైతం లాంకెస్టర్‌షైర్‌తో ఆడుతూ కౌంటీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా నార్థంపన్‌షైర్‌తో తలపడిన వేళ వాషింగ్టన్‌ సైతం ఐదు వికెట్లు తీసి కౌంటీల్లో (5/76) ఘనంగా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలి రోజు నాలుగు వికెట్లు తీసిన అతడు రెండోరోజు ఒక వికెట్ తీశాడు. దీంతో నార్థంప్టన్‌షైర్‌ జట్టు 235 పరుగులకు ఆలౌటైంది. కాగా.. కెంట్‌, లాంకెస్టర్‌షైర్‌ జట్లు ప్రస్తుతం మూడో రోజు ఆట ఆడుతున్నాయి. ఇక నవ్‌దీప్‌, వాషింగ్టన్‌ ఎలా వికెట్లు తీశారో ఇక్కడ చూడండి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు