KL Rahul: కేఎల్ రాహుల్‌ ‘స్పేర్‌ టైర్‌’లాంటోడు.. ఎక్కడైనా ఆడేస్తాడు: సిద్ధూ

టీ20 ప్రపంచ కప్‌ జట్టులో ఎవరెవరు ఉంటారు? అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం ఇవ్వడం కష్టమే. ఐపీఎల్‌లో రాణిస్తే మాత్రం అవకాశం దక్కినట్లే. 

Published : 07 Apr 2024 13:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత స్టార్‌ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై (KL Rahul) మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్ సిద్ధూ ప్రశంసలు కురిపించాడు. రాహుల్‌ను జట్టులో ఏ స్థానంలోనైనా ఆడించవచ్చని.. జట్టుకు అతడు ‘స్పేర్‌ టైర్‌’లాంటి వాడని సిద్ధూ (Sidhu) వ్యాఖ్యానించాడు. రాహుల్‌ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ లేరని ప్రశంసించాడు. గుజరాత్‌తో లఖ్‌నవూ (GT vs LSG) మ్యాచ్‌ నేపథ్యంలో సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘కేఎల్ రాహుల్‌ ప్రశంసలకు పూర్తి అర్హుడు. అతడు మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయగలడు. వికెట్‌ కీపర్‌గానూ బరిలోకి దింపొచ్చు. ఓపెనర్‌గానూ రాణించగల సత్తా ఉన్న ఆటగాడు. జట్టులోని ఏ పాత్రనైనా పోషించగల క్రికెటర్. జీప్‌ వెనుక ఎప్పుడూ ఒక టైర్‌ను చూసి ఉంటాం. దానిని స్పేర్‌ టైర్‌ అంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో దానిని వినియోగించుకోవచ్చు. ఏ చక్రం బాగోలేకపోయినా.. దానిని మార్చి ఈ టైర్‌ను అక్కడ పెట్టుకొనే వెసులుబాటు ఉంది. కేఎల్ రాహుల్‌ తప్ప ఇలాంటి సత్తా మరెవరిలోనూ లేదని భావిస్తా’’ అని సిద్ధూ వ్యాఖ్యానించాడు. 

ఆ ముగ్గురిపై దూబె ఒత్తిడి తెస్తాడు: సెహ్వాగ్‌

భారత జట్టులోని స్థానం కోసం తీవ్ర పోటీ ఉన్న సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచ కప్‌ స్క్వాడ్‌లోకి రావాలని ప్రతి క్రికెటర్ కల కంటాడు. ఐపీఎల్‌లో అదరగొట్టేస్తే చోటు దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ క్రమంలో చెన్నై ఆటగాడు శివమ్‌ దూబె (Shivam Dube) ఇప్పుడున్న స్టార్‌ క్రికెటర్లకు పోటీనిస్తాడని భారత మాజీ ఆటగాడు సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు. ‘‘ శివమ్‌ దూబె ఆటను చూశాక.. టీ20 ప్రపంచ కప్‌లో అతడికి చోటు దక్కడం ఖాయమని చెబుతున్నా. దీంతో పంత్, శ్రేయస్, సూర్యకుమార్‌, కేల్ రాహుల్‌కు పోటీనిస్తాడు. వీరంతా ఐపీఎల్‌లో నిలకడగా పరుగులు చేస్తేనే అవకాశం దక్కుతుంది. మంచి ఫామ్‌లో ఉన్నావారినే జట్టులోకి తీసుకుంటారు’’ అని సెహ్వాగ్ (Sehwag) తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని