Published : 19 Jan 2022 01:20 IST

Rohit - Gavaskar : రోహిత్‌ జట్టును నడిపించలేడేమో:సునీల్ గావస్కర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌ : విరాట్‌ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలికినప్పటి నుంచి తర్వాతి కెప్టెన్ ఎవరు అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ దిగ్గజం సునీల్ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీలా ఫిట్‌గా ఉంటూ.. అన్ని మ్యాచులకు అందుబాటులో ఉండే ఆటగాడికే అవకాశమివ్వాలని సూచించాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు కోహ్లీ గత శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే.

‘భారత జట్టును నడిపించాలంటే ఫిట్‌నెస్ చాలా అవసరం. ప్రస్తుతం టెస్టు కెప్టెన్సీ రేసులో సీనియర్‌ ఆటగాడు రోహిత్‌ శర్మ ముందంజలో ఉన్నాడు. కానీ, అతడిని ఫిట్‌నెస్‌ సమస్య వేధిస్తోంది. తొడకండరాల గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. భవిష్యత్తులో అది పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి టెస్టు పగ్గాలు అప్పగిస్తే.. జట్టును నడిపించగలడా అనే అనుమానం ఉంది. టీమ్‌ఇండియా భవిష్యత్తు దృష్ట్యా.. కోహ్లీలా ఫిట్‌గా ఉండి, సుదీర్ఘకాలం కెప్టెన్‌గా కొనసాగే ఆటగాడు కావాలి. కెప్టెన్‌గా ప్రతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే ఆటగాడు అవసరం’ అని సునీల్ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు.

పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు తిరుగులేని రికార్డుంది. దాన్ని ఎవరూ కాదనలేరు. 34 ఏళ్ల హిట్‌మ్యాన్‌ ఎంత కాలం టెస్టు క్రికెట్లో కొనసాగుతాడో కచ్చితంగా చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించి మరింత ఒత్తిడి పెంచొద్దనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అతడి ఫిట్‌నెస్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో తర్వాతి టెస్టు కెప్టెన్‌ ఎవరు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో రోహిత్‌ గాయం నుంచి కోలుకొంటున్నాడు. త్వరలో వెస్టిండీస్‌తో జరుగనున్న సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని